సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత!

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఇన్నోసెంట్ క‌న్నుమూశారు. క‌రోనా ఇన్పెక్ష‌న్, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో మార్చి 3న కొచ్చిలోని ఓ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. నిన్న రాత్రి 10.30 గంట‌ల‌కు…

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఇన్నోసెంట్ క‌న్నుమూశారు. క‌రోనా ఇన్పెక్ష‌న్, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో మార్చి 3న కొచ్చిలోని ఓ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. నిన్న రాత్రి 10.30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. 

1972లో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఆయ‌న దాదాపు 750కిపైగా సినిమాల్లో న‌టించారు. మ‌జావిల్ కావ‌డి జాత‌కం, ప‌థం నిల‌యిలే తీవండి, రావ‌ణ‌ప్ర‌భు, వేషం, స్నేహ‌వీడు, మ‌న‌సిన్న‌క్క‌రేతో పాటు ప‌లు మ‌ల‌యాళ సినిమాల్లో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని ప‌డించారు. మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, హిందీ సినిమాల్లో న‌టించారు. ఇంగ్లీష్ లో కూడా ఓ సినిమా చేశారు. న‌టుడిగానే కాకుండా ర‌చ‌యిత‌, ప్రొడ్యూస‌ర్‌గా, నేప‌థ్య గాయ‌కుడిగా రాణించి బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో పేరుతెచ్చుకున్నారు.

గ‌త ఏడాది క‌డువాతో పాటు మ‌రో నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు . అత‌డు న‌టించిన‌ పాచువుమ్ అద్భుత‌విళ‌క్కుమ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ప‌లు సినిమాల్లో న‌టించిన ఇన్నోసెంట్ 2014 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చల‌కుడి నియోజ‌క‌వ‌ర్గం నుండి లెప్ట్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అభ్య‌ర్ధిగా గెలిచారు. 2019లో ఓడిపోయారు. ఆయ‌న మృతిప‌ట్ల కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తో పాటు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.