సౌత్ లో నయనతారకు ఓ ఇమేజ్ ఉంది. ఓ సినిమా చేసిందంటే అందులో ఆమె పాత్రకు అంతోఇంతో గుర్తింపు ఉంటుంది. అలాంటి హీరోయిన్ క్యారెక్టర్ ను కాస్తా గెస్ట్ రోల్ గా మార్చేశాడు దర్శకుడు మురుగదాస్. దర్బార్ సినిమాలో అసలు నయనతార ఎందుకుందో ఎవరికీ తెలీదు. కథకు ఆమెకు అస్సలు సంబంధమే లేదు.
దర్బార్ లో ఆమెను కేవలం గెస్ట్ గా మాత్రమే వాడుకోవడంతో విమర్శలు చెలరేగాయి. తన పాత్రకు ఏమాత్రం వెయిట్ లేకపోవడంతో నయనతార కూడా హర్ట్ అయింది. ఈ విషయంపై దర్శకుడు మురుగదాస్ తో ఆమె మాట్లాడింది. తన అసంతృప్తిని వ్యక్తంచేసింది.
నిజానికి తన పాత్రకు ఎంత నిడివి ఉంటుంది, సినిమాలో తన క్యారెక్టర్ బలమెంత లాంటి విషయాల్ని ముందే అంచనా వేస్తుంది నయనతార. దర్బార్ విషయంలో కూడా ఈ లెక్కలు వేసుకుంది. కానీ ఎడిటింగ్ లో నయన్ కు చెందిన చాలా సీన్లు లేపేశాడు దర్శకుడు. పైగా అక్కడున్నది రజనీకాంత్. దీంతో నయనతార కూడా ఏం చేయలేకపోయింది.
మొత్తమ్మీద దర్బార్ సినిమాలో నయనతారకు ప్రాధాన్యం తగ్గిపోయిందనేది వాస్తవం. దీంతో ఆమె ఫ్యాన్స్ మురుగదాస్ మీద చాలా కోపంగా ఉన్నారు. నయనతార అభిమానుల్ని సంతృప్తిపరిచేలా ఈ మేరకు మురుగదాస్ నుంచి ఓ ఫీలర్ కూడా వచ్చేసింది. త్వరలోనే నయనతార మెయిన్ లీడ్ గా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తాడట మురుగదాస్.