ఏపీలో బీజేపీదే అధికారమట…?

ఓ వైపు ప్రత్యేక హోదా తుంగలో తొక్కారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు  అతీ గతీ లేకుండా పోయింది. కానీ ఏపీలో బీజేపీదే 2024లో అధికారమని ఆ పార్టీ నేతలు ఢంకా భజాయించి మరీ…

ఓ వైపు ప్రత్యేక హోదా తుంగలో తొక్కారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు  అతీ గతీ లేకుండా పోయింది. కానీ ఏపీలో బీజేపీదే 2024లో అధికారమని ఆ పార్టీ నేతలు ఢంకా భజాయించి మరీ చెప్పుకుంటున్నారు.

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే పదే పదే ఇదే మాట చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాషాయ పతాక ఏపీలో ఎగరడం ఖాయమని ఆయన అంటున్నారు. మరి అది జోస్యమా. అంచనావా. లేక అతి విశ్వాసమా అర్ధం కాక కార్యకర్తలే డైలామాలో పడుతున్నారు.

నిజానికి ప్రత్యేకా హోదా విషయంలో ఇన్ని వంకర్లు తిరిగినందుకే 2019 ఎన్నికల్లో బీజేపీకి జనం కర్రు కాల్చి వాత పెట్టారు. నోటా కంటే కూడా తక్కువ ఓట్లు ఇచ్చారు. ఇపుడు పోలవరం నిధులను మూడవ వంతుకు కుదిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. 

అది జరిగిన వెంటనే ఇలా బీజేపీ నాయకులు ఆశల పందిరిలో ఊరేగడం అంటే ఎలా ఆలోచించాలో మరి అంటున్నారు సగటు జనం.

ఇక ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ అయితే ఏపీలో మత రాజకీయాలు చోటు చేస్తుకుంటున్నాయని తాజాగా  ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.  సింహాచలం తిరుపతి భూములపైన అధికార పార్టీ పెద్దలు కన్నేశారట. 

అంటే దీన్ని బట్టి చూస్తే ఏపీలో మతం కార్డుతోనే 2024లో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటోందని అర్ధమవుతోంది. మరి దానిని ఏపీ జనం ఆమోదిస్తారా.

రాష్ట్ర అవతరణ దినోత్సవం