అమరావతి నుంచినే అంతా సాగాలంటూ.. అమరావతి కేంద్రంగానే సాగుతున్న ఆందోళనల గురించి క్షేత్ర స్థాయి సమాచారాన్ని గమనిస్తే.. కొన్ని విస్మయకరమైన విషయాలపై పూర్తి స్పష్టత వస్తోంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు అమరావతి అంటూ.. రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. అయితే అమరావతిలో సాగుతున్న ఆందోళనల్లో మాత్రం మొదటి నుంచి చెబుతున్నట్టుగా ఒక సామాజికవర్గం వారు మాత్రమే కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. రైతులు.. అనేది కేవలం అమరావతి ఆందోళనల విషయంలో వాడుకుంటున్న అంశం మాత్రమే. అక్కడ ఆందోళనల వెనుక ప్రధాన పాత్ర ఒక సామాజికవర్గం వారిదే అని క్షేత్ర స్థాయి పరిశీలనతో స్పష్టం అవుతూ ఉంది. అది కూడా ఆ సామాజికవర్గం రియల్టర్లు ఈ ఆందోళనలకు స్పాన్సర్ షిప్ చేస్తూ ఉన్నారని స్ఫష్టం అవుతూ ఉంది.
అమరావతి ఆందోళనలకు సంబంధించి రెండు రకాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫేక్ ఫొటోలు. అమరావతిలో రైతులపై పోలీసుల దాష్టీకం అంటూ కొన్ని ఫేక్ ఫొటోలను వైరల్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఆ ఫొటోలన్నీ ఇప్పటివి కావు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ప్రజలపై సాగించిన దాష్టీకాలకు సంబంధించిన ఫొటోలను ఇప్పుడు అమరావతికి ముడిపెడుతూ కొంతమంది నకిలీ ఫొటోలను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఇక అమరావతి ఆందోళనలకు సంబంధించిన ఇతర ఫొటోలు.. ఖరీదైన రైతులవి. చేతిలో ఐ ఫోన్లతో, మణికట్టుకు ఐ వాచ్ లతో ఆందోళనలు చేస్తున్న ఫొటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలా ఒక సామాజికవర్గం తమ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఆందోళనగా అమరావతి ఆందోళనలు చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది బీసీ వర్గాల వారు ఈ ఆందోళనల్లో పాలు పంచుకోవడానికి ముందుకొస్తున్నా కమ్మదనం ఎక్కువై పోవడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారని తెలుస్తోంది. బీసీలను వెనక్కు నెట్టి ఆ సామాజికవర్గం వారే అక్కడ కూడా తమదే ఆధిపత్యం ఉండాలని అంటున్నారట. దీంతో ఇతరులు పూర్తిగా అక్కడ నుంచి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని సమాచారం.