పవన్‌కళ్యాణ్ తిరిగి నటించడం మొదలు పెట్టిన తర్వాత అనౌన్స్ చేసిన సినిమాల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు పూర్తి కాలేదు. అనౌన్స్ చేసిన సినిమాలు అలా వుండగానే పవన్ మరో సినిమా అనౌన్స్ చేసాడు. విశేషం ఏమిటంటే… వకీల్ సాబ్ తర్వాత అదే సినిమా మొదలు కానుంది. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.
అనౌన్స్ అయితే చేసారు కానీ ఇది మొదలవడానికి మరో ఏడాది పడుతుందని ఫాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రం డిసెంబర్ లేదా జనవరిలో సెట్స్ మీదకు వెళ్లిపోతుంది. ఇంకా మరో హీరో ఎవరనేది ఖరారు చేసుకోలేదు.మిగతా సినిమాలు పక్కనపెట్టి ఈ చిత్రం చేయడానికి పవన్ ఎందుకు ఉత్సాహ పడుతున్నట్టు? అందుకు నిర్మాత అతనికి ఆఫర్ చేసిన పాే్యకజీయేనని అంటున్నారు.
ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ నలభై రోజుల కాల్షీట్లు ఇస్తాడట. అందుకుగాను పవన్‌కి ముప్పయ్ కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో ఇరవై అయిదు శాతం వాటా కూడా ఇస్తారట. దర్శకుడికి రెమ్యూనరేషన్ వుండదు కనుక, ఈ చిత్రానికి మేకింగ్ కాస్ట్ కూడా తక్కువే వుంటుంది కనుక పవన్‌కళ్యాణ్ రెగ్యులర్ సినిమాలకు తగ్గట్టు బిజినెస్ జరిగితే లాభాలు భారీ స్థాయిలో వుంటాయి. పైగా సినిమా మొదలంటూ పెడితే సమ్మర్ రిలీజ్‌కి రెడీ అయిపోతుంది కనుక అదో బెనిఫిట్.