అన్న గారి కూతుళ్ళూ అలా అంటే ఎలా…!?

స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఆయనంటే  జనాలకు బాగా ఇష్టం. ఆయన వారికి దైవ సమానుడు. వెండి తెర వేలుపు. మరి అన్నగారికి బడుగు జనం అంటే…

స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ఆయనంటే  జనాలకు బాగా ఇష్టం. ఆయన వారికి దైవ సమానుడు. వెండి తెర వేలుపు. మరి అన్నగారికి బడుగు జనం అంటే ప్రేమ, మమకారం రెండూ మెండే.

ఆయనకు ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే చాలా ఇష్టం. ఆయన 1994 ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాలలో చివరిది అయిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు.  ఇక ఆయన తన సభలూ సమావేశాలు ఎక్కువగా ఇక్కడ నుంచే మొదలుపెడుతూండేవారు.

ఆయన 1995 మధ్యలో అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు కారణంగా పదవి నుంచి దిగిపోయారు కానీ లేకపోతే ఆయన ఉత్తరాంధ్రాకు భారీగా అభివ్రుధ్ధి ప్రాజెక్టులను తీసుకురావాలనుకున్నారని అంటారు.

ఇక ఆయన పదవీచ్యుతులైన తరువాత అల్లుడు మీద స‌మర శంఖారావం పూరించింది కూడా ఇదే ఉత్తరాంధ్రలో. చిత్రమేంటంటే ఆయన్ని దింపేందుకు చంద్రబాబు అండ్ కో రాజకీయ మంత్రాంగం నడిపింది కూడా ఇదే ఉత్తరాంధ్రలో.

ఏ విధంగా చూసుకున్నా టీడీపీ అన్నా, అన్న గారు అన్నా మమకారం ఎక్కువగా ఉన్న నందమూరి పార్టీని 2019 ఎన్నికల వరకూ ఇక్కడ జనం నెత్తిమీదనే పెట్టుకున్నారు. చంద్రబాబుని మూడు సార్లు సీఎంగా చేయడంలో ఈ జిల్లాలు ప్రముఖ పాత్ర పోషించాయి.

ఇవన్నీ ఇలా ఉంటే అన్న గారు కుమార్తె అన్న ఒక ఒక కారణంగా దగ్గుబాటి పురంధేశ్వరిని విశాఖ ఎంపీగా గెలిపించారు. ఆమె ఆ దఫా కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలా అందలం ఎక్కడానికి ఈ మూడు జిల్లాలు కారణం.

అటువంటిది కన్న తండ్రి ఎంతగానే ప్రేమించిన ఉత్తరాంధ్రా పట్ల అల్లుడు బాబుకు లేకపోతే పోయింది కూతుళ్ళకైనా మమకారం ఉండాలి కదా అంటున్నారు మాజీ మంత్రి దాడి వీరభద్ర‌రావు. అమరావతి రాజధాని కోసం దీక్ష చేస్తూ తండ్రి ప్రేమను పొందిన ఉత్తరాంధ్రాకు భువనేశ్వరి దెబ్బ కొడితే, అమరావ‌తి ముద్దు విశాఖ వద్దే వద్దు అంటూ ఓట్లు వేయించుకుని పదవులు పొందిన పురంధేశ్వరి కూడా అనడం కంటే దారుణం ఉందా అని దాడి అంటున్నారు. మరి అన్న గారి కూతుళ్ళకైనా ఈ ప్రాంతం మీద, ఇక్కడి వెనకబాటుతనం మీద జాలి కలగలేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.