ట్రోల్ చేస్తున్నారు.. సమంత నీకు అర్థమౌతోందా!

గ్లామర్ గా కనిపించడం వేరు. అంతా విమర్శించేలా గా తయారవ్వడం వేరు. ఈ రెండు అంశాల మధ్య చాలా చిన్న తేడా ఉంది. ప్రతి లుక్ గ్లామరస్ గా ఉంటుందని అనుకుంటే అది పొరపాటు.…

గ్లామర్ గా కనిపించడం వేరు. అంతా విమర్శించేలా గా తయారవ్వడం వేరు. ఈ రెండు అంశాల మధ్య చాలా చిన్న తేడా ఉంది. ప్రతి లుక్ గ్లామరస్ గా ఉంటుందని అనుకుంటే అది పొరపాటు. ఇన్నాళ్లూ ఆ తేడాను జాగ్రత్తగానే మెయింటైన్ చేసింది సమంత. కానీ రీసెంట్ గా జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ కు కాస్త తేడాగా వచ్చి విమర్శల పాలైంది. ప్రస్తుతం ఆ ఫొటోలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.

జీ సినీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైంది సమంత. మజిలీ సినిమాలో నటనకు గాను అవార్డు కూడా అందుకుంది. అంతా బాగానే ఉంది కానీ, ఆ ఫంక్షన్ కోసం సమంత వేసుకున్న డ్రెస్ మాత్రం విమర్శల పాలైంది. దాదాపు బాడీ మొత్తం కనిపించేలా ఆమె వేసుకున్న డ్రెస్ కాస్త అతి అనిపించింది. ఇంకా చెప్పాలంటే లోపల బికినీ వేసుకొని పైన ఉల్లిపొర చుట్టుకొచ్చినట్టుంది ఆ డ్రెస్.

కె.విశ్వనాధ్ నుంచి చిరంజీవి వరకు ఎంతోమంది ప్రముఖులు హాజరైన ఆ అవార్డ్ ఫంక్షన్ కు అంత హాట్ గా రాకపోతే ఏం అవుతుందంటూ నెటిజన్లు సమంత లుక్ పై ట్రోలింగ్ షురూ చేశారు. మరీ ముఖ్యంగా అక్కినేని కోడలివన్న సంగతి మరిచిపోవద్దంటూ సూచనలు చేశారు. నిజానికి సమంతకు ఈ ట్రోలింగ్ కొత్త కాదు. గతంలో కూడా ఆమె డ్రెస్సింగ్ పై ఇలాంటి విమర్శలు చెలరేగాయి. అయితే అప్పటి డ్రెస్సింగ్స్ తో పోలిస్తే, తాజాగా ధరించిన దుస్తులు మాత్రం గ్లామర్ హద్దుల్ని చెరిపేసింది.

సమంత కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె నాగచైతన్యకు భార్య, నాగార్జునకు కోడలు. కాబట్టి కొన్ని పరిమితులకు లోబడి ఆమె వ్యవహరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ భర్త-మామయ్య ఆమెకు బాగానే ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడా స్వేచ్ఛను సమంత దుర్వినియోగం చేస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఇకపైనైనా ఇలా తొడలు కనిపించేలా దుస్తులు ధరించడం మానేయమంటూ సలహాలిస్తున్నారు. అయితే ఇలాంటి ట్రోల్స్ ను పట్టించుకునే రకం కాదు సమంత. ఆ విషయాన్ని నెటిజన్లు కూడా కాస్త అర్థం చేసుకుంటే మంచిది.