ఇక మిగిలింది క్రిస్మస్ నే

సినిమా రంగానికి దీపావళి ఆశలు కూడా నీరుకారిపోయినట్లే. మరో నెల అంటే నవంబర్ చివరి వరకు ఇప్పుడు అమలులో వున్న కోవిడ్ నిబంధనలే కొనసాగుతాయని క్లారిటీ వచ్చేసింది. Advertisement ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో…

సినిమా రంగానికి దీపావళి ఆశలు కూడా నీరుకారిపోయినట్లే. మరో నెల అంటే నవంబర్ చివరి వరకు ఇప్పుడు అమలులో వున్న కోవిడ్ నిబంధనలే కొనసాగుతాయని క్లారిటీ వచ్చేసింది.

ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ చేసినా, సినిమాలు లేవు, కలెక్షన్లు లేవు. ఇదిలావుంటే ఆంధ్రలోని అయిదు జిల్లాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టాల్సి వుంది. 

అందువల్ల యాభై శాతం ఆక్యుపెన్సీ అన్నది ఇప్పట్లో మారేలా కనిపించడం లేదు. దీపావళి అయిపోతుంది. ఇక మిగిలింది క్రిస్మస్ సీజన్ మాత్రమే.

డిసెంబర్ లో కనుక టోటల్ ఆక్యుపెన్సీకి అనుమతి వస్తే అప్పుడు కొత్త సినిమాలు రావడానికి అవకాశం వుంది. లేదూ అంటే ఇక సంక్రాంతి కోసం ఆశగా చూడాల్సిందే.

అందుకే దాదాపు అరడజను సినిమాలు సంక్రాంతి మీద దృష్టి పెట్టాయి. రెడ్, క్రాక్, రంగ్ దే, బ్యాచులర్, వకీల్ సాబ్, ఉప్పెన, ఇంకా చాలా సినిమాలు లైన్ లో వున్నాయి. డిసెంబర్ కూడా మిస్ అయింది అంటే దాదాపు తొమ్మిది నెలలు టాలీవుడ్ డిక్షనరీలోంచి పక్కకు పోయినట్లే.  అందరి అదృష్టం బాగుండి కరోనా సెకెండ్ వేవ్ రాకపోతే ఫరవాలేదు.

ఇప్పుడిప్పుడే పదుల సంఖ్యలో సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఇవన్నీ రెడీ అయితే, 2021 సమ్మర్ నుంచి టాలీవుడ్ కు పూర్వకళ వస్తుంది.

అసలే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తోంది