ఫస్ట్ టైమ్ మహేష్ ను క్రాస్ చేసిన బన్నీ

ఓవర్సీస్ లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ మూవీస్ కు యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఇక ప్రీమియర్స్ సంగతి…

ఓవర్సీస్ లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ మూవీస్ కు యూఎస్ లో భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఇక ప్రీమియర్స్ సంగతి సరే సరి. ఇలాంటి ఏరియాలో మహేష్ ను బీట్ చేశాడు బన్నీ. ప్రీమియర్స్ లో సరిలేరు నీకెవ్వరు సినిమాను అల వైకుంఠపురములో అధిగమించింది.

ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రీమియర్స్ లో అల వైకుంఠపురములో సినిమాకు ఏకంగా 8 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ప్రీమియర్స్ లో 7 లక్షల 60వేల డాలర్లు వచ్చాయి.

ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. మహేష్ మూవీతో పోలిస్తే బన్నీ మూవీకి ప్రీమియర్స్ టిక్కెట్ రేటు తక్కువ. 14 డాలర్ల టిక్కెట్ ధరతోనే సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీమియర్ వసూళ్లను దాటేశాడు బన్నీ. అయితే ఇక్కడ బన్నీ గొప్పదనం కంటే ఇతర అంశాలే ఎక్కువ ప్రభావం చూపాయి.

అల వైకుంఠపురములో పాటలు పెద్ద హిట్టవ్వడంతో పాటు త్రివిక్రమ్ కు ఓవర్సీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడానికి ఇదే కారణం. ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన ప్రతి సినిమాకు ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు బన్నీ ప్రీమియర్స్ లో 5 లక్షల డాలర్లు (హాఫ్ మిలియన్ మార్క్) దాటలేదు. ఈ సినిమాతో అది సాధ్యమైంది. గతంలో నితిన్ కు అ..ఆ సినిమాతో భారీ ఓపెనింగ్స్ ఇచ్చిన త్రివిక్రమ్, ఈసారి బన్నీకి ఇలా కలిసొచ్చాడన్నమాట.