బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్యన పర్సనల్ అటాక్ తప్పడం లేదు! మీరెంత మంది అంటే మీరింత మంది లేరా? అంటూ సంతానం విషయంలో కూడా అక్కడి నేతలు తూలనాడుతున్నారు! వ్యక్తిగత దాడి వద్దంటూనే తిరిగి అదే రకంగా ప్రతిదాడులు చేసుకునేలా మాట్లాడుతున్నారు అక్కడి నేతలు. ముందుగా మొదలుపెట్టింది నితీష్ కుమారే.
లాలూ-రబ్రీదేవిలు ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారంటూ నితీష్ కుమార్ విమర్శించారు. అయినా వాళ్లకు ఎక్కువ సంతానం ఉన్న సంగతి ఈయనకు ఇప్పుడే తెలిసిందా? గత ఎన్నికల్లో లాలూతో కలిసే కదా పోటీ చేసింది! అప్పుడు తెలీదా లాలూకు అంత మంది కూతుర్లు, అంతమంది కొడుకులు ఉన్నది!
చంద్రబాబు కదా.. మోడీ విషయంలో భార్య గురించి మాట్లాడినట్టుగా ఉంది నితీష్ తీరు. మోడీతో కలిసి తిరిగినన్ని రోజులూ ఆయన గురించి చంద్రబాబు మాట్లాడలేదు. మోడీతో రాజకీయంగా దూరం అయ్యాకా చంద్రబాబు పర్సనల్ అటాక్ కు దిగారు. తనకు కుటుంబం ఉందంటూ, మోడీకి లేదంటూ చంద్రబాబు ఎన్నికల ముందు గప్పాలు కొట్టారు. అలాగే ఉంది నితీష్ తీరు.
నితీష్ కు లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ గట్టి రివర్స్ పంచ్ ఇచ్చాడు. తన తల్లిదండ్రులు సంతానాన్ని ఆశీర్వాదంగా భావించారంటూనే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి ఎంత మంది అన్నదమ్ములు ఉన్నారంటూ నితీష్ ను ప్రశ్నించారు తేజస్వి. మోడీ అన్నదమ్ములు ఆరు మంది ఉన్నారని.. ఆ విషయంలో మీరెలా స్పందిస్తారు? అంటూ నితీష్ ను ప్రశ్నించాడు తేజస్వి.