హీరో రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ

కరోనాతో బాధపడుతున్న హీరో రాజశేఖర్ కు వైద్యులు రెండో దశ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. మొన్నటివరకు యాంటీ బయాటిక్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తో ట్రీట్ మెంట్ ఇచ్చిన వైద్యులు.. తాజాగా ప్లాస్మా థెరపీ…

కరోనాతో బాధపడుతున్న హీరో రాజశేఖర్ కు వైద్యులు రెండో దశ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. మొన్నటివరకు యాంటీ బయాటిక్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తో ట్రీట్ మెంట్ ఇచ్చిన వైద్యులు.. తాజాగా ప్లాస్మా థెరపీ మొదలుపెట్టారు.

ట్రీట్ మెంట్ లో భాగంగా రాజశేఖర్ కు ప్లాస్మా ఎక్కించినట్టు వైద్యులు ప్రకటించారు. శరీరంలో ఉన్న కరోనా వైరస్ ను తగ్గించేందుకు ప్లాస్మా థెరపీ ఎంతగానో ఉపయోగపడుతున్న విషయం ఆల్రెడీ రుజువైంది. శరీరంలో రోగనిరోధక శక్తి (ప్లేట్ లెట్స్ సంఖ్య)ని ఇది పెంచుతుంది. తద్వారా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది.

ప్లాస్మా థెరపీతో పాటు సైటోసార్బ్ (Cytosorb) డివైస్ థెరపీని కూడా స్టార్ట్ చేసినట్టు వైద్యులు ప్రకటించారు. ఇవన్నీ కరోనా ట్రీట్ మెంట్ లో భాగంగానే జరుగుతున్నాయని.. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అంటున్నారు డాక్టర్లు.

రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా.. కొన్ని రోజుల కిందట జీవిత, వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అంతకంటే ముందు రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు వైరస్ నుంచి బయటపడ్డారు. రాజశేఖర్ కు మాత్రం ఇంకా ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. 

ప‌చ్చ బ్యాచ్  ఇలా దొరికేసింది