ఆర్జీవీ టైటిల్ పై వివాదం

ఎందరినో బజారుకు లాగుతూ సినిమాలు చేసిన ఆర్జీవీ కథను బయోపిక్ గా తీయడం అన్నది ఈ మద్య వార్తల్లోకి వచ్చింది. కవి జొన్నవిత్తుల కథ, మాటలు, దర్శకత్వం అందిస్తూ నిర్మించే సినిమాకు టైటిల్ ఇవ్వడానికి…

ఎందరినో బజారుకు లాగుతూ సినిమాలు చేసిన ఆర్జీవీ కథను బయోపిక్ గా తీయడం అన్నది ఈ మద్య వార్తల్లోకి వచ్చింది. కవి జొన్నవిత్తుల కథ, మాటలు, దర్శకత్వం అందిస్తూ నిర్మించే సినిమాకు టైటిల్ ఇవ్వడానికి ఫిల్మ్ ఛాంబర్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ టైటిల్ పెట్టాలంటే ఆర్జీవీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెమ్మని అడిగినట్లు తెలుస్తోంది.

దీంతో సినిమాను నిర్మించాలనుకుంటున్న వారు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల టైటిళ్లు రిజిస్టర్ చేసినపుడు ఆర్జీవీ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. తమ టైటిల్ ఆర్జీవీ అంటే రామ్ గోపాల్ వాద్రా అని అంతే తప్ప రామ్ గోపాల్ వర్మ కాదని అంటున్నారు. ఆర్జీవీ అనే టైటిల్ కింద ట్యాగ్ లైన్ గా 'ఒక సైకో భయోపిక్' అని పెట్టారు.

ఈ ఛాంబర్ ఇవ్వకుంటే వేరే ఛాంబర్ లో తెచ్చుకుంటామని, అయితే అంతకన్నా ముందుగా తమకు టైటిల్ ఎందుకు ఇవ్వరో ఇన్ రిటెన్ ఇవ్వాలని, అది తేల్చుకుంటామని ఆర్జీవీ సినిమా నిర్మాతలు అంటున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ లో కృష్ణగారిది సర్‌ప్రైజ్ పాత్ర..మహేశ్‌బాబు