రూ.30వేల కోట్లు.. పోలవరంలో బాబు కమీషన్ ఇది

ఒక్క పోలవరం ప్రాజెక్టు నుంచి చంద్రబాబు తీసుకున్న కమిషన్ 30 వేల కోట్ల రూపాయలు. గడిచిన ఐదేళ్లలో వివిధ కాంట్రాక్టులు, టెండర్ల పేరిట.. కేవలం పోలవరం ప్రాజెక్టు నుంచి చంద్రబాబు 30వేల కోట్ల రూపాయల…

ఒక్క పోలవరం ప్రాజెక్టు నుంచి చంద్రబాబు తీసుకున్న కమిషన్ 30 వేల కోట్ల రూపాయలు. గడిచిన ఐదేళ్లలో వివిధ కాంట్రాక్టులు, టెండర్ల పేరిట.. కేవలం పోలవరం ప్రాజెక్టు నుంచి చంద్రబాబు 30వేల కోట్ల రూపాయల కమీషన్లు పొందారు. ఈ మేరకు పరోక్షంగా చంద్రబాబుపై ఆరోపణలు చేశారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్.

“2014 నుంచి రెండున్నరేళ్ల పాటు చంద్రబాబు ఏం చేశారో చెబుతాను వినండి. కమీషన్ల కోసం కక్కుర్తిపడి కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో ప్రభుత్వం తీసుకుంది. 

ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. 50వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో 18వేల కోట్లు ఖర్చయిందనుకుంటే.. అది అటుఇటుగా 20 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అని బాబుకు తెలుసు. కమీషన్ల కోసం కక్కుర్తుపడి 70శాతం వేరియేషన్ చూపించారు.”

ఇలా కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరం నిర్వాసితులైన లక్ష కుటుంబాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు అనీల్ కుమార్. 

ఈ తప్పు తెలుసుకున్నారు కాబట్టే చంద్రబాబు రాష్ట్రం విడిచి పోయారని, లోకేష్ మాత్రం ఇంకా సిగ్గులేకుండా రాష్ట్రంలోనే తిరుగుతూ, వచ్చిరానీ తెలుగుతో చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరంపై నిజానిజాలు తెలుసుకోకుండా లోకేష్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ముందు వాస్తవాలు తెలుసుకొని ఆ తర్వాత ఆరోపణలు చేయాలని సూచించారు అనీల్ కుమార్. 

చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల, కొంతమందితో పెట్టుకున్న లోపాయికారీ ఒప్పందాల వల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అలాంటి టీడీపీ ఈరోజు సిగ్గులేకుండా తమపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు అనీల్. 

108 సార్లు ఓంఓం స్వాహా.. అనుకుంటే కరోనా రాదు