లోకేశ్ విమ‌ర్శ‌లు …ముక్కున వేలేసుకున్న టీడీపీ

నారా లోకేశ్ భ‌లే విచిత్ర‌మైన క్యారెక్ట‌ర్‌. తానేం మాట్లాడుతున్నారో …. ఒక్కోసారి ఆయ‌న‌కే అర్థం కాన‌ట్టుంది. అయినా అర్థ‌మైతేనే ఆశ్చ‌ర్యపోవాల‌ని స్వ‌యంగా టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. కొన్ని రోజులుగా వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు టీడీపీ…

నారా లోకేశ్ భ‌లే విచిత్ర‌మైన క్యారెక్ట‌ర్‌. తానేం మాట్లాడుతున్నారో …. ఒక్కోసారి ఆయ‌న‌కే అర్థం కాన‌ట్టుంది. అయినా అర్థ‌మైతేనే ఆశ్చ‌ర్యపోవాల‌ని స్వ‌యంగా టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. కొన్ని రోజులుగా వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ భూమార్గం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఏమాట కామాట చెప్పుకోవాలంటే …లోకేశ్ జ‌నంలోకి రావ‌డం పార్టీ శ్రేణుల‌కే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఇదిలా ఉండ‌గా కోస్తా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన ఓ విమ‌ర్శ చివ‌రికి టీడీపీ శ్రేణుల్నే ముక్కున వేలేసుకునేలా చేసింది. అదేంటో తెలుసుకుందాం.

పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని లోకేశ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారో లేదో పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయ‌న నిలదీశారు. 2014లో కూడా వైసీపీపై తండ్రీకొడుకులు ఇలాంటి ఆరోప‌ణ‌లే చేశారు. 

చివ‌రికి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఎన్‌డీఏ నుంచి బ‌య‌టికొచ్చి ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోస‌మంటూ కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ …ఆ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్‌తో కలిసి చంద్ర‌బాబు సుడిగాలి పర్య‌ట‌న‌లు చేశారు. ఇప్పుడు వైసీపీని పిల్ల కాంగ్రెస్ అని లోకేశ్ మాట్లాడ్డం సొంత పార్టీ శ్రేణుల‌కే విడ్డూర‌మ‌నిపిస్తోంది.

వైసీపీ ఎంపీల‌పై లోకేశ్ నోరు పారేసుకున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు రాక‌పోతే ట్వీట్లు చేయ‌డం కాద‌ని, ప‌నికి మాలిన ఎంపీలు పోరాటం చేయాల‌ని లోకేశ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  అంతేకాదు, వైసీపీ తోడు దొంగ‌లు త‌న‌ను తిర‌గ‌కుండా దాడులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అస‌లు అధికార పార్టీ నేత‌లు వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో తిరిగితే తామెందుకు తిరుగుతామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

పవన్ కళ్యాణ్ వచ్చినా, ఏ కళ్యాణ్ వచ్చినా భయపడేది లేదు

108 సార్లు ఓంఓం స్వాహా.. అనుకుంటే కరోనా రాదు