నోరు తెరచి చెప్పకుండా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం నుంచి తరలిపోతోందని నిర్ణయం తీసుకున్నట్లుగా,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా నోరు తెరచి చెప్పలేదు.  కానీ తన చేతలతో అంతకుమించిన సంకేతాలను ఆయన ప్రజలకు పంపిస్తున్నారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నం నుంచి తరలిపోతోందని నిర్ణయం తీసుకున్నట్లుగా,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా నోరు తెరచి చెప్పలేదు.  కానీ తన చేతలతో అంతకుమించిన సంకేతాలను ఆయన ప్రజలకు పంపిస్తున్నారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి సంబంధించి జరుగుతున్న సమీక్షలు, ఇస్తున్న ఆదేశాలు, అధికారులను పురమాయిస్తున్న తీరుతెన్నులు… యివన్నీ కూడా రాజధాని తరలింపునకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇస్తూన్నాయి ఉన్నాయి.

తాజాగా విశాఖ పట్టణానికి సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి..  డీపీఆర్ తయారు అయిందో లేదో తెలుసుకోకుండానే మహా మెట్రో ప్రాజెక్టుకు తక్షణం టెండర్లు వెళ్లాలని ఆదేశించడం ఇలాంటిదే. విశాఖపట్నం లో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని తరలింపు ప్రకటన తేలలేదుగానీ…  మెట్రోకు మాత్రం పచ్చజెండా ఊపేశారు.  ఉన్నపళంగా పనులు మొదలై పోవాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. అయితే ఇంకా డీపీఆర్ తయారు కాలేదని  అధికారులు చెప్పడంతో తక్షణం ఆ పని పూర్తి చేయాలని ఆయన ఆదేశించి, ఊరుకున్నారు!

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూడు రోజులు ఉంటాయి చిన్న సంకేతం ఇవ్వడం తప్ప,  ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపు గురించి అధికారికంగా మాట్లాడలేదు.  అయితే తరలింపు తథ్యం అని అర్థం వచ్చేలా…  ఆయన మంత్రివర్గంలోని సహచరులు పదేపదే మాట్లాడుతున్నారు. ఎవరెన్ని మాట్లాడినప్పటికీ  ప్రభుత్వాధినేత స్వయంగా ప్రజలకు సమాచారం చెప్పి తీరవలసిందే.  కానీ జగన్ తాను స్వయంగా ఎప్పటికీ ఈ సంగతి బయట పెడతారో కానీ…  ఆయన చేతలు నిర్ణయాల ద్వారా ప్రజలకు  సాంతం అర్థమైపోతుంది.

విపక్షాలు ఒకవైపు ఎంతగా యాగీ చేస్తున్నప్పటికీ…  పట్టించుకోక పోవడం కూడా జగన్ అందిస్తున్న ఒక సంకేతం.  రైతుల ఆందోళన శృతి మించి హింస, విధ్వంసాల బాట పడుతున్నప్పటికీ…  వారి మాటలు చెవిన వేసుకోకపోవడం కూడా మరొక సంకేతం. వీటితోపాటు…  విశాఖ నగరాభివృద్ధిని వరుస సమీక్షలతో పరుగులు పెట్టిస్తుండడం కూడా గమనిస్తే.. ఇక ముఖ్యమంత్రి స్వయంగా పెదవివిప్పి మాట్లాడాల్సిన అవసరం లేదనే అనిపిస్తోంది