బస్సు యాత్రను అడ్డుకుని తప్పు చేశారు

తెలుగుదేశం పార్టీ సంకల్పించిన బస్సు యాత్రను జగన్ ప్రభుత్వం అనుమతించి ఉండాల్సింది.  తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ గంపగుత్తగా బస్సులో బయలుదేరి ప్రజల మధ్యకు వెళ్లి ఉంటే కనుక, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వారు…

తెలుగుదేశం పార్టీ సంకల్పించిన బస్సు యాత్రను జగన్ ప్రభుత్వం అనుమతించి ఉండాల్సింది.  తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ గంపగుత్తగా బస్సులో బయలుదేరి ప్రజల మధ్యకు వెళ్లి ఉంటే కనుక, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వారు చేస్తున్న ఆందోళనకు ప్రజాబలం ఎంతో చాలా స్పష్టంగా తెలిసిపోయేది. వారి ఉద్యమాలలో డొల్లతనం బయట పడేది. చంద్రబాబు పరువు పోయేది. అయితే పోలీసులు అడ్డుకోవడం ద్వారా తమను తాము హీరోలుగా ప్రొజెక్టు చేసుకునేందుకు తెలుగుదేశం నాయకులకు అవకాశం ఇచ్చినట్లు అయింది.

3 రాజధానుల ప్రతిపాదన తెరమీదకు వచ్చిన నాటి నుంచి,  తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే అమరావతి నుంచి రాజధాని తరలించడానికి వీల్లేదంటూ,  ఆందోళనలు మాత్రం స్థానికంగా తప్ప మరెక్కడా జరగడం లేదు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చినప్పటికీ…  తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో  తెలుగుదేశం అధినేత పిలుపునకు ఆయన పార్టీ కార్యకర్తలు కూడా స్పందించలేదు.

రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు చంద్రబాబు పిలుపు ఇచ్చిన ఉద్యమాన్ని పట్టించుకోవడం మానేశారు. పార్టీ అసమర్ధత బయట పడిపోయింది. అయితే దీనిని కప్పిపుచ్చుకోవడం లక్ష్యం అన్నట్లుగా…  తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర కు పిలుపునిచ్చింది.  బస్సులో నాయకులను బయలుదేర తీసింది. ఈ యాత్రలో పోలీసులు అడ్డుకున్నారు.

దీనిని అనుమతించి ఉంటే గనుక…  వారి వాదనకు బలం ఎంతో తేలిపోయేది. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో..  ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనలకే జై కొడుతున్న తరుణంలో…  లో ఈ బస్సు యాత్ర వెళితే గనుక జనమే ఛీ కొట్టి ఉండేవారు. బస్సులో ఉన్న నాయకులు తప్ప, స్థానికంగా పోగేసిన అతి కొద్ది మంది జనం తప్ప..  ఉద్యమాలు తేలిపోయేవి.  సాధారణంగా ఏ పని అయినా సరే తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటారు. అమరావతి తప్ప రాష్ట్రంలో మరో ప్రాంతం అభివృద్ధి చెందకూడదు..  అన్న దురాలోచన ఉన్నట్లుగా…  చంద్రబాబు నాయుడు సంకల్పించిన ఈ బస్సు యాత్ర తిరగబడేది. అలాంటి అవకాశం లేకుండా పోలీసులు దానిని ముందుగానే అడ్డుకుని తప్పు చేశారని ప్రజలు భావిస్తున్నారు.