‘మంచివాడి’ ఎమోషన్..ఫైటింగ్స్

మంచి వాడి మాటలు, పాటలేనా? ఫైట్లు చేయకుండా వుంటాడా? ఫైట్లు కూడా బాగానే చేస్తాడని చెప్పాలనుకున్నారు దర్శకుడు సతీష్ వేగ్నిశ. ఓ గుజరాతీ సినిమా ను తీసుకుని, తెలుగు టచ్ ఇస్తూ, శివలెంక శివప్రసాద్…

మంచి వాడి మాటలు, పాటలేనా? ఫైట్లు చేయకుండా వుంటాడా? ఫైట్లు కూడా బాగానే చేస్తాడని చెప్పాలనుకున్నారు దర్శకుడు సతీష్ వేగ్నిశ. ఓ గుజరాతీ సినిమా ను తీసుకుని, తెలుగు టచ్ ఇస్తూ, శివలెంక శివప్రసాద్ తో కలిపి ఆదిత్య మూవీస్ పతాకంపై  నిర్మించిన హీరో కళ్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఈ సినిమా ట్రయిలర్ కుటుంబ ఎమోషన్లు, యూత్ ఫుల్ లవ్, ప్లస్ మాస్ యాక్షన్ సీన్లు సమపాళ్లలో కలిపి వదిలినట్లు వుంది. 

సినిమా పక్కా ఫ్యామిలీ ఎమోషన్ సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడు ట్రయిలర్ కట్ లో మాత్రం, వీలయినంతవరకు ఆల్ రౌండ్ సినిమా అని చెప్పాలనే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ట్రయిలర్ లో యాక్షన్ సీన్లను, ఎమోషన్, ఫ్యామిలీ సీన్ల మధ్య చాలా వెల్ ప్లాన్డ్ గా మిక్స్ చేసారు. 

ఓ ఫ్యామిలీ టచ్ వున్న మాస్ సినిమా అని చెప్పే ప్రయత్నం దర్శకుడు సతీష్ చేసారు. ఆయన ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి. ట్రయిలర్ ఓకె. సినిమా వచ్చాక సతీష్ వేగ్నిశ మూడో ప్రయత్నం ఎలా వుంది అన్నది తెలుస్తుంది.