నిన్ను అడిగే.. ప్రెగ్నెంట్ అవుతా: దీపిక వ్యంగ్యం!

పెళ్లి కాని హీరోయిన్ల‌ను.. పెళ్లెప్పుడు అని అడ‌గ‌డం, పెళ్లై కూడా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న వారిని పిల్ల‌లెప్పుడు అని అడ‌గడం.. ఈ రెండూ కామ‌న్. స‌ద‌రు హీరోయిన్లు మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ప్ర‌శ్న‌లు వ్య‌క్తం…

పెళ్లి కాని హీరోయిన్ల‌ను.. పెళ్లెప్పుడు అని అడ‌గ‌డం, పెళ్లై కూడా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న వారిని పిల్ల‌లెప్పుడు అని అడ‌గడం.. ఈ రెండూ కామ‌న్. స‌ద‌రు హీరోయిన్లు మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతూ ఉంటాయి.  వాటికి ఆ హీరోయిన్లు ర‌క‌ర‌కాల స‌మాధానాలు ఇస్తూ ఉంటారు. కొంద‌రు 'అప్పుడేనా..' అంటూ సిగ్గుప‌డిపోతూ ఉంటారు. అయితే కొంద‌రు ముదుర్లు వ్యంగ్యంగా స‌మాధానాలు ఇస్తూ ఉంటారు.

ఈ మ‌ధ్య‌నే స‌మంత‌ను ఇదే ప్ర‌శ్న అడిగితే.. ఆమె వ్యంగ్యంగా ఏదో డేట్ చెప్పింది. స‌మాధానం చెప్ప‌డం ఇష్టం లేకే స‌మంత ఏదో తోచిన డేట్ న చెప్పి సైడైపోయింది. సోష‌ల్ మీడియాలో త‌న ఫాలోయ‌ర్ కు ఆ త‌ర‌హా స‌మాధానాన్ని ఇచ్చింది స‌మంత‌.

ఇక ఇప్పుడు దీపిక వంతు. బాలీవుడ్ స్టార్ హీరోనే పెళ్లి చేసుకుని, ఎంచ‌క్కా ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతూ ఉన్నారు. ఈ క్ర‌మంలో పిల్ల‌ల గురించి వీరి వ‌ద్ద ప్ర‌శ్న‌లు త‌ప్ప‌డం లేదు. దీనిపై దీపిక‌ను ఒక రిపోర్ట‌ర్ అడుగ‌గా..ఆమె వ్యంగ్యంగా స్పందించింది. 

'నేను ప్రెగ్నెంట్ లా క‌నిపిస్తున్నానా.. నేను ఫ్యామిలీని ప్లానింగ్ చేసుకున్న‌ప్పుడు క‌చ్చితంగా చెబుతా. నీ ప‌ర్మిష‌న్ తోనే ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటా..' అంటూ దీపిక స‌మాధానం ఇచ్చింది. ఈ స‌మాధానం విన్నాకా.. ఇప్పుడ‌ప్పుడే ఎవ‌రూ దీపిక‌ను ఈ ప్ర‌శ్న అడ‌గ‌రేమో!

రాజమౌళి నన్ను మాట్లాడొద్దని చెప్పారు.. రామ్ చరణ్