‘జేసీకి సిగ్గులేదు…బాబుకు మానం లేదు’

‘అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి సిగ్గులేదు…జేసీ బాస్ చంద్ర‌బాబుకు మానం లేదు’ అని వారిద్ద‌రిని చూసే వారికి అనిపిస్తాయి. ఇదే అభిప్రాయాన్ని టీడీపీ నేత‌లు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు జేసీ…

‘అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి సిగ్గులేదు…జేసీ బాస్ చంద్ర‌బాబుకు మానం లేదు’ అని వారిద్ద‌రిని చూసే వారికి అనిపిస్తాయి. ఇదే అభిప్రాయాన్ని టీడీపీ నేత‌లు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు జేసీ మారుపేరు. ఎప్పుడు ఎవ‌రిపై ఎలా మాట్లాడుతారో ఆయ‌న‌కే తెలియ‌దు. చివ‌రికి త‌న‌పై తానే సెటైర్ వేసుకునే స్వ‌భావం ఆయ‌న‌ది. ఇటీవ‌ల ఆయ‌న సొంత పార్టీపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

‘దేశంలో ప్రాంతీయ పార్టీల పీడ పోవాల్సిందే. మా తెలుగుదేశంతో స‌హా’ అని జేసీ దివాక‌ర్‌రెడ్డి ఆదివారం విమ‌ర్శించారు. ఈ కామెంట్ తీవ్ర కల‌క‌లం రేపింది. అనంత‌పురంలో సోమ‌వారం ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ ప‌రంప‌ర‌ కొన‌సాగించారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబపాలన సాగుతోందని వ్యాఖ్యనించారు. రాజధాని పేరుతో టీడీపీ, వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నది వాస్తవమని జేసీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు.

టీడీపీ స‌హా ప్రాంతీయ పార్టీల పీడ పోవాల‌న‌డం, ప్రాంతీయ పార్టీల్లోకుటుంబ పాల‌న సాగుతోంద‌నడం, రాజ‌ధాని పేరుతో టీడీపీ-వైసీపీ నేత‌లు వేల కోట్లు దోచుకున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన జేసీపై చంద్ర‌బాబు మౌనంగా భ‌రించ‌డం వెనుక భ‌య‌మా? వ‌్యూహం దాగి ఉన్నాయా అనేది అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ ముఖ్య నేత‌లు అంటున్నారు. కానీ రాజ‌ధానిపై అధికార వైసీపీ తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో వాటికి బ‌లం ఇచ్చేలా జేసీ వ్యాఖ్యానాలు ఉన్నాయ‌ని, పార్టీకి న‌ష్టం క‌లిగిస్తున్న జేసీపై ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌నే అభిప్రాయం టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఒక వైపు టీడీపీని దుమ్మెత్తి పోస్తూ , మ‌రోవైపు అదే పార్టీలో కొన‌సాగుతున్న జేసీ దివాక‌ర్‌రెడ్డికి సిగ్గులేద‌ని- ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ప్రేక్ష‌క పాత్ర పోషిస్తున్న చంద్ర‌బాబుకు మానం లేద‌ని ఆ పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తంగా కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అమరావతి అంటే ప్రేమ ఎందుకు.. ఇతర ప్రాంతాలంటే ద్వేషమెందుకు ?