అధునాతన సాంకేతికతను దేశానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ ఓఎన్జీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ లోనూ ఆధునిక సాంకేతికతను జోడించి అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. దేశంలోనే అతిపెద్దదైన అసోం ఆన్ షోర్ వ్యవస్థలో ముడి చమురు, రవాణా వ్యవస్థను పునర్ నిర్మించడం ద్వారా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వ్యవస్థను ఎంఇఐఎల్ తన సాంకేతికతను ఉపయోగించి ఆధునీకరించింది. ఈ ప్రాజెక్ట్ ను 2400 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ పద్ధతిలో దక్కించుకున్న ఎంఇఐఎల్ అసోం రాష్ట్రంలోని లఖ్వా గ్యాదరింగ్ స్టేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసింది. డిసెంబర్ 26, 2019న ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం ఓఎన్జీసీ, ఎంఇఐఎల్ 2020 జనవరి 6న ప్రారంభించడంతో వాణిజ్యపరమైన వినియోగంలోకి తీసుకువచ్చాయి.
ఓఎన్జీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం.. భూ ఉపరితల (ఆన్ షోర్) ప్రాజెక్ట్ లో దేశంలో ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్. ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రాజెక్ట్ ను ఎంఇఐఎల్ తన ఆధునిక పరిజ్ఞానంతో సుదూరమైన పైపులైన్ లు ఉండగా వాటి దూరాన్ని, సంఖ్యను తగ్గించడంతో పాటు రిమోట్ తరహాలో పనిచేయించడం ద్వారా ఎంతో క్లిష్టమైన పనులను, భారాలను ఓఎన్జీసీకి తగ్గించింది. దేశీయ ముడిచమురు రంగంలో ఈ తరహా సాంకేతికతను ఉపయోగించనుండడంతో దిగుమతి చేసుకునే అవసరం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అధునాతన సాంకేతికతో కాలుష్యా నివారణ….
అసోం రెన్యూవల్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు రోజుకు క్రూడాయిల్ ప్రాసెసింగ్ 10,000 ఘణపు మీటర్లు, శుద్ధి సామర్థ్యం 12,000 ఘణపు మీటర్లు, వాటర్ ఇంజెక్షన్ సామర్థ్యం 5,300 ఘణపు మీటర్లు సాధ్యమవుతుంది. అదే విధంగా ఖనిజ వాయువు ఎల్డీ కంప్రెషర్ ప్రాసెసింగ్ మూడు రకాలుగా ఉంటుంది. తక్కువ, మధ్య, అధిక రకాలు ఉంటాయి. అవి వరుసగా 16 లక్షల ఘణపు మీటర్లు, 10 లక్షల ఘనపు మీటర్లు, 15 లక్షల ఘణపు మీటర్ల చొప్పున ప్రతీరోజూ కంప్రెస్ చేస్తారు. సెంట్రల్ ట్యాంక్ సామర్థ్యం 50 వేల ఘనపు మీటర్లు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి ప్రస్తుతం ఉన్న 1.4 ఎంటిపిఏ (మిలియన్ టన్స్ పర్ ఇయర్-10.3 మిలియన్ బ్యారెల్స్) చమురు ఉత్పత్తిని ఇప్పుడు పునర్ నిర్మించి ఆధునీకరించడం వల్ల సామర్థ్యం 2.5 ఎంటిపిఏ అంటే 18.3 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తి, సరఫరా, న్వి ప్రాసెసింగ్‌కు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో లఖ్వా, లఖ్మణి కేంద్రాలు చాలా కీలకమైనవి. ఈ ప్రాజెక్ట్ లో ప్రధానంగా వెల్ ఫ్లూయిడ్ లింక్ తో పాటు చమురు, గ్యాస్ సరఫరా అయ్యే పైపులైన్లను, గ్యాస్ లిఫ్ట్ లైన్లు, వ్యవస్థను సమర్థంగా పనిచేసేందుకు ఉపయోగపడే వాటర్ ఇంజెక్షన్ లైన్లను నిర్మించింది. ఇలా చేయడం ద్వారా కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నిరోధించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకభూమికను నిర్వహించనుంది.
అంతా రిమోట్ కంట్రోల్ తోనే…
ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మారుమూల ప్రాంతంలో ఉన్న యంత్రాలను, పరికరాలను వైర్లెస్ పద్ధతిలో పనిచేయించేందుకు రిమోట్ కనెక్టివిటీ పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతి ద్వారా సేకరించిన ముడిచమురును ఇంధనం వెల్ ఫ్లూయిడ్ ద్వారా ప్రధానవనరుకు చేరుస్తారు. అక్కడి నుంచి చమురు, ఖనిజవాయువు విడివిడిగా వాటివాటి గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ కు (జీజీఎస్)కు చేరుతుంది. అక్కడి నుంచి చమురు వేరువేరుగా సీటీఎఫ్ కు (సెంట్రల్ ట్యాంక్ ఫాం), ఇటీఎఫ్ కు (ఎఫ్లియంట్ ట్రిట్మెంట్ ప్లాంట్), అదే సమయంలో ఖనిజవాయువు జీసీపి కేంద్రాలకు చేరుతుంది.
రాబోయే మూడు దశాబ్దాలకు అనుగుణంగా…
గతంలో ముడి చమురు సరఫరా చేసేందుకు 800 కిలోమీటర్ల ఉండే పైప్ లైన్ ను ఇప్పుడు అధునాతన పద్ధతును ఉపయోగించి 560 కిలోమీటర్ల పైప్ లైన్ ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందువల్ల ఓఎన్జీసీకి 240 కిలోమీటర్లమేర పైప్ లైన్ నిర్మాణం తగ్గించింది ఎంఇఐఎల్. పాత వ్యవస్థలో ప్రధాన నిర్మాణాు ఉండగా ఇప్పుడు వాటిని 9 కేంద్రాలుగా అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేసింది. దీనివ్ల ప్రాజెక్ట్ వ్యయం తగ్గి ఆ మేరకు ఓఎన్జీసీకి ఆదా అయ్యింది. మొత్తం ప్రాజెక్ట్ లో 9 ప్రాధాన నిర్మాణాలను అంటే గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్లు 4 తో పాటు మరో 5 ఇతర ముఖ్యమైన నిర్మాణాను పూర్తిచేసింది. రాబోయే మూడు దశాబ్దాల అవసరాలకు తగిన విధంగా ఎటువంటి నిర్వాహణ పరమైన సమస్య లేకుండా సమర్థంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఆధునీకరించిన అధునాతన ఆటోమేటెడ్ ఉత్పత్తి సౌకర్యాలు ఇందులో ఏర్పాటయ్యాయి. దీనివ్ల మానవ నియంత్రిత, నిర్వాహణ సమస్యలు తలెత్తకుండ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది.
క్యాపిటివ్ పవర్ ప్లాంట్ -గ్యాస్ టర్బైన్…
ఈ ప్రాజెక్ట్ లో ఎంఇఐఎల్ ప్రధానమైన 5 గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ ను నిర్మించింది. 2 వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్లను ఈ వ్యవస్థ నిర్వాహణకు అవసరమైన రీతిలో ఏర్పాటు చేసింది. వాటి ద్వారా 2 వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్లు నిర్మించారు. సమీకరించిన గ్యాస్ ను కంప్రెస్ చేసి నిల్వ చేసే విధంగా రెండు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగా ఈ వ్యవస్థ అవసరాలకు తగిన విధంగా ఉపయోగపడేందుకు ఒక్కొక్కటి 12.9 మెగావాట్ల (మొత్తం సామర్థ్యం 64.5) సామర్థ్యం కలిగిన 5 యూనిట్లతో క్యాపిటివ్ పవర్ ప్లాంటును గ్యాస్ టర్బైన్ ద్వారా ఏర్పాటు చేశారు. కీలకమైన పైప్ లైన్ నెట్ వర్క్ తో పాటు కాలం చెల్లిన పురాతన వ్యవస్థను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా టెస్టింగ్, ఫ్రి కమీషనింగ్ మొదలైన బాధ్యతన్నింటిని ఈ సంస్థనే నిర్మించింది. ఈ వ్యవస్థలో గ్యాస్ కండీషనింగ్ విధానం చాలా కీలకమైనది. ఇందుకోసం గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ నిర్మించారు. వ్యర్థాలను పూర్తిగా అంతమొందించేందుకు అవసరమైన భస్మిపటలం వ్యవస్థ కూడా నిర్మించారు.