10న దుబాయ్ లో ‘అల’లు

బన్నీ-త్రివిక్రమ్ కాంబో 'అల వైకుంఠపురములో' ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. 6న హైదరాబాద్ లో మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 10న దుబాయ్ లో ఓ మాంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు.…

బన్నీ-త్రివిక్రమ్ కాంబో 'అల వైకుంఠపురములో' ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. 6న హైదరాబాద్ లో మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 10న దుబాయ్ లో ఓ మాంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఓపెన్ గా జనరల్ పబ్లిక్ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ఫంక్షన్ కు త్రివిక్రమ్-బన్నీ-పూజా హెగ్డే హాజరవుతారు. కేవలం ఏదో ప్రెస్ మీట్ మాదిరిగా కాకుండా, హైదరాబాద్ లో చేసే ఈవెంట్ మాదిరిగా ఈ పంక్షన్ ను ప్లాన్ చేస్తున్నారు. 

ఇదిలా వుండగా, విశాఖలో మరో ఫంక్షన్ చేయాల్సి వుంది. కానీ సమయం లేదు. చేస్తే 7,8,9 ల్లో చేయాలి. కానీ 8న బంగళూరులో ఫ్యాన్స్ ను మీట్ కావాలన్నది ప్లాన్. అందువల్ల విశాఖ లో ఫంక్షన్ ఎలా అన్నది ప్రశ్న. దుబాయ్ ఫంక్షన్ మానేసి విశాఖలో చేయాలా?లేదా విశాఖలో విడుదల తరువాత చేయాలా? అన్నది డిస్కషన్ లో వుంది. విశాఖ ఫంక్షన్ కనుక మస్ట్ అంటే దుబాయ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం వుంది. లేదూ అంటే 10న దుబాయ్ లో బన్నీ ఫ్యాన్స్ మాంచి పండగే.