ఎంత నొక్కేయకపోతే, ఇంతలా బాధపడతారు!

ఎన్టీఆర్ కూతురు, తన భార్య భువనేశ్వరితో బంగారు గాజులు ఇప్పించి, ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణతో కన్నీళ్లు పెట్టించి.. అమరావతి రైతుల ఉద్యమంలో ఏదో చేసేద్దామనుకున్నారు చంద్రబాబు. కానీ ఈ నందమూరి ఫ్యామిలీ ఎపిసోడ్ పూర్తిగా…

ఎన్టీఆర్ కూతురు, తన భార్య భువనేశ్వరితో బంగారు గాజులు ఇప్పించి, ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణతో కన్నీళ్లు పెట్టించి.. అమరావతి రైతుల ఉద్యమంలో ఏదో చేసేద్దామనుకున్నారు చంద్రబాబు. కానీ ఈ నందమూరి ఫ్యామిలీ ఎపిసోడ్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం తమ భూములు కాపాడుకోడానికే చంద్రబాబు, ఫ్యామిలీని రంగంలోకి దింపారని అర్థం కావడంతో.. రాష్ట్ర ప్రజానీకం మరింతగా ఆయన్ని చీదరించుకుంటున్నారు.

చంద్రబాబు ఫ్యామిలీ చేస్తున్న ఓవర్ యాక్షన్ సామాన్య ప్రజలకు వెగటు పుట్టించింది.రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో ఏదో చేశారనే ఆలోచన మొదలైంది. ఎంత నొక్కేయకపోతే, ఇంతలా బాధపడతారు అంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ప్రజలు.

తను వేసిన ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని బహుశా చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. భార్యను రంగంలోకి దింపి సింపతీ కొట్టేయాలి చూసిన బాబు పప్పులుడకలేదు. ఊహించని విధంగా ప్రజలంతా “కమ్మ కోటరీ”పై చర్చించుకోవడంతో షాక్ అవ్వడం బాబు వంతయింది. కేవలం తన సామాజిక వర్గం కోసం ఇదంతా చేస్తున్నాననే విషయం చంద్రబాబు మనసుకు తెలుసు. కానీ దీన్నొక జాతి సమస్యగా, ప్రాంత సమస్యగా మార్చాలని ఆయన కుతంత్రం పన్నారు. కానీ బాబు అసలు రంగు ప్రజలకు తెలిసిపోయింది.

రైతుల భూములు ఎక్కడికీ పోలేదు. అభివృద్ధి కోసం తీసుకున్న వాటికి ఒప్పందాల ప్రకారమే కౌలు చెల్లిస్తోంది జగన్ ప్రభుత్వం. వినియోగంలోకి ఇంకా తీసుకురాని భూముల్ని వ్యవసాయానికి ఉపయోగించే ఆలోచనలో కూడా ఉంది. మరిక్కడ రైతులకు జరిగిన అన్యాయం ఏంటి? ఆందోళన చేస్తున్న వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాక ఇంకెవరు? వీరికి కొమ్ము కాయడానికి రంగంలోకి దిగిన చంద్రబాబుని ఏమనాలి?

మొత్తమ్మీద అమరావతి విషయంలో చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు, కేవలం 29 గ్రామాల నాయకుడిగా మారిపోయారు. మిగతా రాష్ట్రమంతా ఆయన్ని చీదరించుకుంటోంది.

టీడీపీ, వైసీపీ లా జాతకాలు మార్చేసిన 2019