బ్యూటిఫుల్ గా డిజాస్టర్ ఇచ్చాడు

“నేను నా హిట్ ని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకుంటానో నా ప్లాఫ్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా తీసుకుంటాను” Advertisement బ్యూటిఫుల్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో స్వయంగా ఆర్జీవీ అన్న…

“నేను నా హిట్ ని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకుంటానో నా ప్లాఫ్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా తీసుకుంటాను”

బ్యూటిఫుల్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో స్వయంగా ఆర్జీవీ అన్న మాటలివి. అప్పుడు జనాలకు ఆ మాటలకు అర్థం తెలియలేదు. ఈరోజు సినిమా రిలీజైన తర్వాత చూస్తే వర్మ అప్పుడు ఎందుకలా అన్నాడో ఈజీగా అర్థమౌతుంది. అవును.. బ్యూటిఫుల్ సినిమాను చాలా అందమైన డిజాస్టర్ గా మలిచారు.

వరుసపెట్టి ఫ్లాపులు కొడుతున్న వర్మ, కొత్త ఏడాదిలో కూడా ఈ సినిమాతో అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఫ్లాప్ తో 2019ను ముగించిన ఆర్జీవీ.. బ్యూటిఫుల్ సినిమా ఫ్లాప్ తో 2020ను ఎప్పట్లానే రొటీన్ గా స్టార్ట్ చేశాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఎంతకీ సినిమా అవ్వట్లేదేంటి అనే ఫీలింగ్ ను రేకెత్తించింది.

ఈసారి కూడా వర్మ ఎప్పట్లానే బేసిక్స్ వదిలేసి సినిమా తీశాడు. 3 ఘాటు సీన్లు పెడితే జనాలు వచ్చేస్తారని భావించాడు. చివరికి ఆ రొమాంటిక్ సీన్లు, హెవీ  ఎక్స్ పోజింగ్ కూడా వెగటు పుట్టించాయి తప్ప అనుభూతి కలిగించలేదు. వర్మ బ్యానర్ పై అగస్త్య మంజు డైరక్ట్ చేసిన ఈ సినిమా, హీరోయిన్ నైనా గంగూలీకి కూడా పనికిరాకుండా పోయింది. ఆమె అందాలు వెండితెరపై నిండుగా వృధా అయ్యాయి.

ఈరోజు బ్యూటిఫుల్ తో పాటు థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా క్లిక్ అవ్వలేదు. కన్నడలో ఆల్రెడీ హిట్ అయిన రక్షిత్ మూవీ అతడే శ్రీమన్నారాయణ సినిమాకు తెలుగులో సరైన ఆదరణ దక్కలేదు. 3 గంటల 6 నిమిషాల ఈ సినిమాను ఆద్యంతం భరించడం కష్టం.

ఇక తమిళ్ లో ఫ్లాప్ అయిన ధనుష్ మూవీ తెలుగులో తూటాగా విడుదలై ఇక్కడ కూడా ఫ్లాప్ మూటగట్టుకుంది. ఉల్లాల ఊల్లాల, రాజా నరసింహా సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి.