అమ‌రాతిలో చంద్ర‌బాబు హైద‌రాబాద్ డ‌బ్బా!

వెళ్లింది అమ‌రావ‌తికి.. అమ‌రావతి నుంచినే స‌ర్వం సాగాలనేది ఆయ‌న డిమాండ్. త‌న హ‌యాం ఐదేళ్ల‌లో అమ‌రావ‌తిలో ఏం సాధించిన‌ట్టో చెబితే అదో ముచ్చ‌ట‌. మిగ‌తా ప్రాంతాల‌కు మూతి క‌ట్టేసి.. అన్నింటికీ అమ‌రావ‌తే అంటూ న‌వ‌రంధ్రాలు,…

వెళ్లింది అమ‌రావ‌తికి.. అమ‌రావతి నుంచినే స‌ర్వం సాగాలనేది ఆయ‌న డిమాండ్. త‌న హ‌యాం ఐదేళ్ల‌లో అమ‌రావ‌తిలో ఏం సాధించిన‌ట్టో చెబితే అదో ముచ్చ‌ట‌. మిగ‌తా ప్రాంతాల‌కు మూతి క‌ట్టేసి.. అన్నింటికీ అమ‌రావ‌తే అంటూ న‌వ‌రంధ్రాలు, న‌వ‌న‌గ‌రాలు అంటూ.. అప్పుడు చేసిన ప‌నుల గురించి ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు మాట్లాడాలి. అయితే అక్క‌డకు వెళ్లి ఆయ‌న హైద‌రాబాద్ డ‌బ్బా కొడుతున్నారు.

త‌ను రొటీన్ గా చెప్పి అర‌గ‌దీసిన డైలాగుల‌నే చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ రికార్డు వేశారు. ప్ర‌పంచ‌మంతా తిరిగి పెట్టుబ‌డుల‌ను తెచ్చిన‌ట్టుగా, మైక్రోసాఫ్ట్ ను తెచ్చిన‌ట్టుగా చెప్పారు.. అవ‌న్నీ అమ‌రావ‌తికి కాదులెండి, హైద‌రాబాద్ క‌ట‌. హైద‌రాబాద్ ను త‌నే డెవ‌లప్ చేసిన‌ట్టుగా మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు ఢంకా భ‌జాయించారు. అక్క‌డ త‌న కుల‌పోళ్ల కోసం డెవ‌ల‌ప్ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు. 

అది వేరే క‌థ‌. హైద‌రాబాద్ క‌థేంటో, హైద‌రాబాద్ ఎలా డెవ‌ల‌ప్ అయ్యిందో.. చంద్ర‌బాబు నాయుడు త‌న వెర్ష‌న్ చాలా సార్లే చెప్పుకున్నారు. అలాంటి హైద‌రాబాద్ లో త‌ను అభివృద్ధి చేసిన హైద‌రాబాద్ లో త‌న పార్టీ ప‌రిస్థితి ఏమిటో చంద్ర‌బాబు మ‌రిచిపోయి ఉండ‌వ‌చ్చు. ప్ర‌జ‌ల‌కు మాత్రం అన్నీ తెలుసు. అయినా అమ‌రావ‌తికి వెళ్లి హైద‌రాబాద్ డ‌బ్బా ఎందుకు?  ఐదేళ్ల‌లోఅమ‌రావ‌తిలో ఏం సాధించారో చెప్పాలి క‌దా. 

భూముల ధ‌ర‌లు ప‌డిపోతాయ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొన‌సాగాల్సిందే అంటూ రాష్ట్రానికి గుదిబండ‌ను కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు నాయుడు చెబుతున్నారు ఇన్ డైరెక్టుగా. ఇక ప‌ది వేల కోట్ల రూపాయ‌లు అంటూ మ‌రో లెక్క చెబుతున్నారు. ల‌క్ష కోట్లు, ప‌ది వేల కోట్లు..ఇలాంటి గాలి నంబ‌ర్ల‌ను తెలుగుదేశం పార్టీ త‌న అవ‌సరానికి వాడుకుంటూ ఉంటుంది. వాటిల్లో లాజిక్ ఉండ‌దు. విన‌డానికి రౌండ్ ఫిగ‌ర్ల‌ను చెప్పండం, హైద‌రాబాద్ డ‌బ్బా కొట్ట‌డం.. చంద్ర‌బాబు నాయుడు నూత‌న సంవ‌త్స‌రం తొలి రోజు కూడా త‌న పాత రొడ్డ‌కొట్టుడు రాజ‌కీయ క‌బుర్లే చెప్పారు.