చంద్రబాబుకు ‘మద్దాలి’ దరువు మొదలైంది

వంశీ వెళ్లిపోయినప్పుడు కాదు, చంద్రబాబుకు అసలైన మద్దెల దరువు ఇప్పుడు మొదలైంది. ఏ జిల్లాలో రాజధాని ప్రాంతం గురించి చంద్రబాబు పోరాటం పేరిట నానా హంగామా చేస్తున్నారో.. అదే గుంటూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే…

వంశీ వెళ్లిపోయినప్పుడు కాదు, చంద్రబాబుకు అసలైన మద్దెల దరువు ఇప్పుడు మొదలైంది. ఏ జిల్లాలో రాజధాని ప్రాంతం గురించి చంద్రబాబు పోరాటం పేరిట నానా హంగామా చేస్తున్నారో.. అదే గుంటూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే బయటకొచ్చారు. అతడే మద్దాలి గిరి. దీంతో రాజధాని అంశంపై మద్దాలి దరువు మొదలైందంటూ కామెంట్లు పడుతున్నాయి. దీనికి ఓ కారణం ఉంది.

మూడు రాజధానుల ప్రకటనతో.. అమరావతి ప్రాంతంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశారు చంద్రబాబు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని అంచనా వేశారు. అయితే అది బాబుకే రివర్స్ అయింది. మూడు రాజధానుల ప్రకటనను ప్రాంతాలకతీతంగా వైసీపీ ఎమ్మెల్యేలు స్వాగతిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే అవకాశంగా తీసుకుని పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు.దీనికి మొదటి అడుగు మద్దాలి గిరి.

జగన్ ను కలిసి ఈ ఎమ్మెల్యే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబుకు బాగా గడ్డిపెట్టారు. ఇప్పటి వరకూ ఈ ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ పూర్తి స్థాయిలో బైటపడకపోయినా.. రేపో మాపో షోకాజ్ నోటీస్ పంపే అవకాశం ఉంది. గిరి కూడా దీని కోసమే వెయిటింగ్. ఆ లాంఛనమేదో పూర్తయితే, తను కూడా అసెంబ్లీలో వంశీ పక్కన కూర్చోవాలని ఈయన ఫిక్స్ అయిపోయారు. ఇక్కడితో కథ ముగిసిపోలేదు.

రాజధాని ప్రకటనను అడ్డు పెట్టుకుని జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, పరోక్షంగా టీడీపీకి దూరమవ్వాలని చూస్తున్నారు గంటా వంటి నేతలు. ఇప్పటికీ గంటా శ్రీనివాసరావుతో పాటు దాదాపు టీడీపీ నేతలంతా మూడు రాజధానుల అంశానికి బహిరంగంగా మద్దతు పలికారు. ఏ క్షణానైనా వాళ్లు టీడీపీకి గుడ్ బై చెప్పే పరిస్థితి ఉంది.

సో.. ఎలా చూసుకున్నా ఇది చంద్రబాబుకే రివర్స్ అయింది. మూడు రాజధానుల విషయంలో ఏదో జరుగుతుందనుకుంటే, బాబుకి ఇంకేదో అయింది. వైసీపీని ఇరుకున పెట్టాలని బాబు భావిస్తే, అది టీడీపీకే నష్టాన్ని తీసుకొచ్చేలా మారింది. గుంటూరు జిల్లాలో టీడీపీకి ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే.

మీ పిల్లల చదువులకు నాది భరోసా :సీఎం