‘విశాఖలో కూడా కమ్మవారున్నారు’

విశాఖలో కూడా కమ్మవారున్నారు. ఈ సంగతి జగన్ కు తెలీదేమో? Advertisement ఈ మాట మాది కాదు. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ ఆయన వ్యాసంలో పేర్కొన్నది. నిజమే, విశాఖలో కూడా కమ్మవారున్నారు. నిజానికి ఏ…

విశాఖలో కూడా కమ్మవారున్నారు. ఈ సంగతి జగన్ కు తెలీదేమో?

ఈ మాట మాది కాదు. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ ఆయన వ్యాసంలో పేర్కొన్నది. నిజమే, విశాఖలో కూడా కమ్మవారున్నారు. నిజానికి ఏ వారైనా..ఎక్కడైనా వుండొచ్చు. అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ జనాలకు తెలియాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. 

విశాఖ తీరం అనుకునే మూడు జిల్లాల్లో కమ్మవారు ఇప్పుడు బలమైన స్థానంలో వున్నారు. అందులో అస్సలు సందేహం లేదు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రియల్ ఎస్టేట్, హోటల్, బిల్డింగ్, ఇండస్ట్రియల్, రాజకీయ ఇతర వ్యాపారరంగాల్లో వారిదే అగ్రస్థానం అందులో కూడా సందేహం లేదు.

కానీ ఇదంతా తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత సంగతి. కానీ అంతకు ముందు సంగతేమిటి? ఈ విషయం తెలియాల్సి వుంది. 

ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తరువాత, తొలిసారి ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి ఒకొక్కరికి కమ్మ సామాజిక వర్గ సభ్యులకు అవకాశం ఇచ్చారు.. అప్పటికి శ్రీకాకుళం జిల్లాలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ, వన్ పర్సంట్ కూడా కమ్మ సామాజిక వర్గ జనాలు లేరు. మరి ఎలా ఇచ్చారు? ఏ ప్రాధాన్యతతో ఇచ్చారు? అదే విధంగా విజయనగరం జిల్లాలో కూడా. విశాఖ సంగతి సరేసరి.

ఇక మూడు జిల్లాల్లో కూడా పార్టీ పదవుల్లో ఎక్కడ వీలయితే అక్కడ కమ్మ సామాజిక వర్గ జనాలకు అవకాశాలు బాగా లభించాయి. ఆ విధంగా అప్పుడు ప్రారంభమైంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కమ్మవారి ఫ్రాబల్యం. అంతే కానీ అంతకు ముందు అంత లేదు. కేవలం జిల్లాకు ఒకరిద్దరు వంతున మాత్రమే వచ్చి వ్యాపారాలు సాగించారు. ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో? మూడు జిల్లాల్లో వున్న వ్యాపార అవకాశాలు వారు అందిపుచ్చుున్నారు. ముందుగా మైనింగ్, ఆపై రియల్ ఎస్టేట్, తరువాత ఉద్యోగ పోస్టింగ్ లు, ఆపై రాజకీయ అవకాశాలు. 

ఇప్పుడు రాధాకృష్ణ అంటున్నారు. విశాఖలోకూడా కమ్మవారు వున్నారు తెలుసా అని. నిజానికి రాధాకృష్ణ గారికి కూడా విశాఖతో సంబంధాలు వున్నాయని, అలనాటి జర్నలిస్ట్ లు అంటారు. ఆయన ఆంధ్రజ్యోతిని తన చేతుల్లోకి ముందు, విశాఖలో ఆయనకూ ఓ భాగస్వామ్య వ్యాపారం వుండేదని. ఆంధ్రజ్యోతి హ్యాండోవర్ చేసుకున్నాక, ఇక బాగుండదు అని వదిలేసారని అంటారు. ఎంత వరకు నిజమో ఆర్కే కే తెలియాలి.

ఆ సంగతి అలా వుంచితే ఉత్తరాంధ్రలో కమ్మవారు వున్నారు అన్న మాట కన్నా, కమ్మవారి ప్రాబల్యం వెనుక తెలుగుదేశం ప్రోత్సాహం వుంది అన్న మాట చెప్పి వుంటే బాగుండేది.