టెక్నాలజీ పెరిగింది. సృజన కూడా పెరిగింది. వీడియో ఎడిటింగ్ అన్నది అరచేతిలోకి వచ్చేసింది. దాంతో రకరకాల క్రియేటివిటీ సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతోంది.
లేటెస్ట్ గా సోషల్ మీడియాను ఊపేస్తున్న సాంగ్..ఊ అంటారా..ఊఊ అంటారా..సమంత హోయలు, దేవీ ట్యూన్, ఇంద్రావతి వాయిస్ అన్నీ కలిసి పాటను వైరల్ చేసేసాయి. ఓవరాల్ గా మగాళ్ల బుద్ది ఇలాగే వుంటుంది అంటూ చంద్రబోస్ రాసిన పాటను పేరడీ చేస్తూ, ఆడాళ్ల బుద్ది ఇదంటూ రాసేసారు.
అంతే కాదు రాసేసి, తన స్వరంతోనే పాడేసి, ‘‘మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’’ అంటూ మార్చి పాడి.. ‘‘వాలి’’ అనే ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
ఆ పాటకు తగినట్టు ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘బిల్లా’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘వేదం’, ‘ఖైదీ నం: 150’ చిత్రాల్లోని పలు ఫేమస్ స్టెప్పులతో ఈ క్లిప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘మేల్ వెర్షన్ అదిరింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పాట బాగానే రాసుకున్నా, పాడడం అంత గోప్పగా లేదు. మంచి వాయిస్ సెట్ అయి వుంటే మరీ వైరల్ అయిపోయేది.