విమ‌ర్శ‌లొస్తున్నా…. మ‌నిషి మార‌లేదు!

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు కార‌కుల‌ను వ‌దిలేసి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ టార్గెట్‌ చేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం త‌న రాజ‌కీయ పంథా మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  Advertisement కార‌ణాలు,…

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు కార‌కుల‌ను వ‌దిలేసి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ టార్గెట్‌ చేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం త‌న రాజ‌కీయ పంథా మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

కార‌ణాలు, లాజిక్‌ల‌తో సంబంధం లేకుండా జ‌గ‌న్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ఆశ‌యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌నే అభిప్రాయాలు రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్  మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో సంఘీభావ దీక్ష చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ ఇప్ప‌టికీ డిమాండ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

విశాఖ ప్రైవేటీక‌ర‌ణ చేస్తున్న‌ది కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం. బీజేపీతో ఏపీలో పొత్తు కుదుర్చుకున్న‌ది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. కానీ ప్రైవేటీక‌ర‌ణ చేసిన బీజేపీని మాట మాత్ర‌మైనా విమ‌ర్శించ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ధైర్యం లేదు. 

జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి మాత్రం ఒంటికాలిపై లేస్తారు. క‌నీసం ప్ర‌జ‌ల‌కు కూడా ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు, ఎవ‌రేమిటో ప‌సిగ‌ట్టే విజ్ఞ‌త ఉంద‌ని ప‌వ‌న్ న‌మ్ముతుంటే, తానింత అవివేకంగా ప్ర‌వ‌ర్తించ‌ర‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

తానేం మాట్లాడినా, చేసినా చెల్లుబాటు అవుతాయ‌నే గుడ్డి న‌మ్మ‌కం త‌ప్ప‌, ప్ర‌జాభిప్రాయం గౌర‌వ లేక‌పోవ‌డం వ‌ల్లే పొంత‌న లేని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.