పక్కలో బాంబు ఒమిక్రాన్

అంతా భయపడినట్లే అవుతోందా అంటే జవాబు అవును అనే. ఒమిక్రాన్. ఆ పేరు కూడా నోరు తిరగని వారికి, ఆ ఊసే పట్టని వారికి ఇపుడు పక్కల్లో బాంబులా ఒమిక్రాన్ వచ్చి పడింది.  Advertisement విజయనగరం జిల్లాలో…

అంతా భయపడినట్లే అవుతోందా అంటే జవాబు అవును అనే. ఒమిక్రాన్. ఆ పేరు కూడా నోరు తిరగని వారికి, ఆ ఊసే పట్టని వారికి ఇపుడు పక్కల్లో బాంబులా ఒమిక్రాన్ వచ్చి పడింది. 

విజయనగరం జిల్లాలో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దాంతో ఏపీలోనే తొట్ట తొలి కేసు అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాలోనే నమోదు కావడం విశేషం.

ఒమిక్రాన్ ఎక్కడో దక్షిణాఫ్రికాలోనే ఉంది అనుకుంటే అది అలా అన్ని ఎల్లలూ దాటుకుంటూ దూకుడుగానే వచ్చేస్తోంది. ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన ఒక వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఆయన భారత్ కి వచ్చి రెండు వారాలు అయినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటిదాకా దేశంలో నాలుగైదు రాష్ట్రాలలోనే ఒమిక్రాన్ ప్రభావం ఉంది. అగ్రభాగాన మహారాష్ట్ర ఉంటే కర్నాటకలో రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇపుడు ఏపీ వాటి సరసన చేరింది. 

ఇక ఒమిక్రాన్ విజయనగరం జిల్లాలో వెలుగు చూడడంతో ఉత్తరాంధ్రాతో పాటు ఏపీ కూడా ఉలిక్కిపడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్న ఒమిక్రాన్ జనసాంద్రత అధికంగా ఉండే  పల్లె వాతావరణం కలిగిన ఉత్తరాంధ్రా ప్రాంతాలలో ఏ రకంగా తన తీవ్రత చూపిస్తుందో అన్న భయం బెంగా అన్నది సర్వత్రా వ్యాపించి ఉంది. 

ఇక్కడ చిత్రమేంటి అంటే కరోనా మొదటి దశ వేళ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఆదిలో పెద్దగా కేసులు కూడా ఉండేవు కావు. ఇపుడు రెండవ దశలో కూడా సింగిల్ డిజిట్ నంబరే కొన్ని నెలలుగా కంటిన్యూ అవుతోంది. అలాంటి చోట ఒమిక్రాన్ అంటే ఆలోచించాల్సిందే.