చిన్నోళ్లకే చీవాట్లు.. ‘పచ్చ’ పెద్దోళ్లు సేఫ్

కోవర్టులను ఏరిపారేస్తానంటూ ఇటీవల స్టేట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా నెల్లూరు జిల్లాలో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అసలు పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియని ముగ్గురిపై వేటు వేశారు.…

కోవర్టులను ఏరిపారేస్తానంటూ ఇటీవల స్టేట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా నెల్లూరు జిల్లాలో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అసలు పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియని ముగ్గురిపై వేటు వేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం సిగ్గుచేటని తేల్చి చెప్పారు. అలాంటప్పుడు చిన్నోళ్లపై వేటు వేసి సరిపెడితే ఎలా..?

నెల్లూరు కార్పొరేషన్లో ప్రచారానికి అచ్చెన్నాయుడు వచ్చారు, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అలాంటప్పుడు చిన్నోళ్లకి చీవాట్లు పెట్టి, పెద్దోళ్లని వదిలిపెడితే ఎలా..? పరోక్షంగా అచ్చెన్న, సోమిరెడ్డికి కూడా బాగానే వాయించేశారని తెలుస్తోంది. 

కాకపోతే బయటకు వారిని ఏమీ అననట్టు బాబు నటించారు. తిట్లు తిన్నవారు కూడా అంతకంటే బాగా దాన్ని రక్తికట్టించారు. మొత్తమ్మీద కుప్పంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టప్పల కథలు తెరపైకి తెచ్చిన బాబు.. వారిపై సస్పెన్షన్ వేటు వేసే పనిలో ఉన్నారు.

నువ్వు తీసేసేదేంది.. మేమే వెళ్లిపోతాం..

ప్రస్తుతం చంద్రబాబు టీడీపీలో కట్టప్పల లిస్ట్ తయారు చేయించారట. వారందరికీ వార్నింగ్ ఇవ్వడం, లేదా కొంతమందిని పార్టీనుంచి సస్పెండ్ చేయడం వంటివి మొదలు పెట్టారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే జాబితాలో ఉన్నవారు అసలు చాన్నాళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్టే ఉన్నారు. 

అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ, వైసీపీ కోసే పనిచేస్తున్నారు. నెల్లూరులో కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ వ్యవహారం పూర్తిగా బయటపడింది.

ఇలాంటి వాళ్లందర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రెడీ అవుతున్నారు బాబు. మరోవైపు ఇలాంటి బ్యాచ్ అంతా బాబు చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు. 

అసలు తామకు టీడీపీతో సంబంధం లేదని, అలాంటి తమను తీసేస్తామని బెదిరిస్తున్నారంటూ నవ్వుకుంటున్నారు. అటు చంద్రబాబు మాత్రం 'కోవర్టులపై వేటు' అంటూ కలరింగ్ ఇస్తున్నారు. తన పార్టీ ప్రముఖుల్ని కాపాడుకుంటున్నారు.