రేట్లు రాకుంటే పుష్ప కు కష్టమే

అఖండ…బాక్సాఫీస్ లెక్కల ప్రకారం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఆంధ్ర 28 కోట్ల మేరకు, సీడెడ్ 10 కోట్ల మేరకు మార్కెట్ అయిన సినిమా. నిఙానికి ప్రభుత్వం రేట్లు తగ్గించినా చూసీ చూడనట్లు వదిలేసింది.…

అఖండ…బాక్సాఫీస్ లెక్కల ప్రకారం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఆంధ్ర 28 కోట్ల మేరకు, సీడెడ్ 10 కోట్ల మేరకు మార్కెట్ అయిన సినిమా. నిఙానికి ప్రభుత్వం రేట్లు తగ్గించినా చూసీ చూడనట్లు వదిలేసింది. దాని వల్ల సీడెడ్ లో యూనిఫారమ్ రేటు 150, ఆంధ్రలో 100 అమ్మేసారు.

వెల్ అండ్ గుడ్. కానీ అంత బ్లాక్ బస్టర్ అయినా, అంతరేట్లు అమ్మినా, తొలివారం దాటితే తప్ప కృష్ణ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఏరియాలు బ్రేక్ ఈవెన్ కావు. ఆ తరువాత వారంలో వచ్చేది ఖర్చులు, లాభాలు. నైఙాం, వైఙాగ్, సీడెడ్ మాత్రం ముందుగా తేరుకున్నాయి.

మరి ఆంధ్ర, సీడెడ్ కలిపి 38 కోట్లకు అమ్మిన అఖండ పరిస్థితి ఇలా వుంటే రెండు ఏరియాలు కలిపి దాదాపు 68 కోట్ల మేరకు విక్రయించిన పుష్ప సంగతి ఏమిటి? యూనిఫారమ్ రేటు అయిదు వందలు అయితే అమ్మలేరు కదా?ఆ నూరు, నూటా యాభైనే అమ్మాలి. బ్లాక్ లో అమ్మితే అది వేరే సంగతి. థియేటర్లకు పోతుంది.

ఈ కొత్త రేట్ల మీద పుష్ప బ్రేక్ ఈవెన్ కావాలంటె కనీసం మూడు వారాలు ఎదురులేకుండా దూసుకుపోవాల్సి వుంటుంది. కానీ స్పైడర్ మాన్ సినిమా మల్టీ ఫ్లెక్స్ ల్లో పోటీ కి వుంది. మలివారం శ్యామ్ సింగ రాయ్ వస్తోంది. అందువల్ల ప్రభుత్వం కరుణించి రేట్లు పెంచడం ఒక్కటే శరణ్యం. ఈ దిశగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి. మరేం ఙరుగుతుందో చూడాలి. 

పుష్ప వెనకాల వస్తున్నా మరింత భారీ సినిమా ఆర్ఆర్ఆర్ ఆలోచన ఏమిటో? ఆ వెంటనే వస్తున్న రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ఏం చేస్తాయో?