మరో మీటూ.. బాలీవుడ్ లో పాయల్ ప్రకంపనలు

కాస్టింగ్ కౌచ్ కంపులోకి మరో దర్శకుడు వచ్చి చేరాడు. ఈసారి తెరపైకి వచ్చిన దర్శకుడు అనురాగ్ కశ్యప్. దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, బాంబే టాకీస్, అగ్లీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న…

కాస్టింగ్ కౌచ్ కంపులోకి మరో దర్శకుడు వచ్చి చేరాడు. ఈసారి తెరపైకి వచ్చిన దర్శకుడు అనురాగ్ కశ్యప్. దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, బాంబే టాకీస్, అగ్లీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడిపై ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్. కొన్నేళ్ల కిందట అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తోంది పాయల్.

తెలుగులో ఊసరవెల్లి, ప్రయాణం లాంటి సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్.. అనురాగ్ కశ్యప్ తనను లోబరుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడనే విషయాన్ని పూసగుచ్చినట్టు వెల్లడించింది. ఆఫీస్ లో వీడియో క్యాసెట్లు నిండుగా ఉండే ఓ గదిలో అనురాగ్ తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.

తన ఆరోపణల్లో భాగంగా మరో ముగ్గురు హీరోయిన్లను కూడా ఆమె లాగింది. హుమా ఖురేషీ, రిచా చద్దా, మహి గిల్ అనే ముగ్గురు హీరోయిన్లు అనురాగ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతడి ఇంటికి వెళ్లి పడక సుఖం అందిస్తారట. వాళ్ల పేర్లు చెప్పి తనను కూడా లోబరుచుకోవడానికి అనురాగ్ కశ్యప్ ప్రయత్నించాడనేది పాయల్ ఆరోపణ.

అయితే తన ఆరోపణలకు సాక్ష్యాలు లేవంటోంది ఈ బ్యూటీ. ఈ ఘటన జరిగిన తర్వాత తను ఫోన్ మార్చానని, బ్యాకప్ తీయలేదని చెబుతోంది. ఇన్నాళ్లూ ఈ చేదు అనుభవం తన మనసులోనే ఉండిపోయిందని.. దాన్ని బయటపెడితే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని ఈ పని చేశానని చెప్పుకొచ్చిన పాయల్.. అనురాగ్ నిజస్వరూపం ఏంటే తెలిస్తే, మిగతా అమ్మాయిలు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో తను ఈ పని చేసినట్టు చెప్పుకొచ్చింది.

తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే అనురాగ్ స్పందించాడు. తనపై ఆరోపణలు చేసే క్రమంలో మరో ముగ్గురు హీరోయిన్లతో పాటు బచ్చన్ కుటుంబాన్ని కూడా పాయల్ వివాదంలోకి లాగడానికి ప్రయత్నిస్తోందని.. ఆమె వీడియో చేస్తేనే అదంతా అబద్ధమనే విషయం తెలిసిపోతోందన్నాడు. కాస్టింగ్ కౌచ్ కు తానెప్పుడు పాల్పడలేదని, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు తననేం చేయలేవంటున్నాడు. రాబోయే రోజుల్లే ఏం జరుగుతుందో తను కూడా చూస్తానని ప్రకటించాడు.

ఈ విషయంపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాల్సిందిగా పాయల్ కు సూచించింది. అటు కంగన కూడా వెంటనే ఈ సీన్ లోకి ఎంటరైపోయింది. పాయల్ కు మద్దతుగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ కొత్త కాస్టింగ్ కౌచ్ ఘటన ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

చిరంజీవి ఎప్పుడూ లేనంతగా ఏడ్చారు