నా పేరు: గౌతమ్ అదానీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రపంచ కుబేరుల్లో నాలుగవ స్థానం నుంచి నాలుగు నెలలల్లో 15వ స్థానంలోకి దబీల్నమని పడిపోయాను.
వయసు: అరవయి దాటాయి. అంటే సీనియర్ సిటిజన్‌గా పిలవవచ్చు. విశ్రాంతి తీసుకోవచ్చు. వ్యాపార సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి కదా!
ముద్దు పేర్లు: భారతీయ భాషల అక్షరమాలల్లో తొలి అక్షరం ‘అ’ నా ముద్దుపేరు. కానీ హిండెన్‌బర్గ్ అ అంటే అబధ్ధం అంటుంది. నా కంపెనీ విలువల్ని ఉన్న దానికన్నా 85 శాతం ఎక్కువ చూపించాను అంటుంది.
విద్యార్హతలు: చదువులో ఎలాగూ డ్రాప్ అవుట్ నే. కానీ వాణిజ్యంలో కూడా నన్ను ‘డ్రాప్ అవుట్’ ను చెయ్యాలనుకుంటోంది హిండెన్ బర్గ్.
విలాసం: ఛ..చ.. అంత సంపాదించాక విలాసం ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమయి వుండదు. మాకు అన్ని దేశాలూ సమానంగా కనిపిస్తాయి. అందుకే మమ్మల్ని ‘మల్టీనేషనల్స్’ అంటారు.
గుర్తింపు చిహ్నాలు: ఒకటి: కొనటం. నేను ఐ మీన్ నా గ్రూపు ఏది కొన్నా, అది అమ్మిన వాడికి కూడా తెలీదు. అదీ ఎన్డీటీవీ చానెల్ కావచ్చు, ఇంకేదయినా సంస్థ కావచ్చు.
రెండు: అప్పు చెయ్యటం. అవును ఆస్తులున్న వాడు అప్పు చేస్తే, ఆ స్టేటస్సే వారు. అందుకే ప్లాంటుకోసం అప్పు చేస్తానంటే బ్యాంకులు మనచుట్టూ తిరుగుతాయి. ఇంటికోసం అప్పు చేస్తానంటే, మనం బ్యాంకుల చుట్టూ తిరగాలి.
సిధ్ధాంతం: ‘క్రోనీ కాపిటలిజం’ అని ఆడిపోసుకుంటారు. కానీ కాదు. నాది ‘కానీ’ కాపిటలిజం. అంటే ‘కానీ’ ఖర్చు లేకుండా, లక్షలకు పడగలెత్తటం.
వృత్తి: సేవ. ప్రజాసేవ. దేశ సేవ. విశ్వ సేవ. కాదన్నవారెవరన్నా వున్నారా…?
హాబీలు: 1. దేశం చిరునామా మార్చటం. ఒకప్పుడు ఇండియా అనగానే ‘టాటా బిర్లాలు’ అనేవారు. ఇప్పుడు ఒక్కటే మాట. అదానీ. తేల్చినా నేనే. ముంచినా నేనే.
2. అన్ని తెరలమీదా మనం నిలబెట్టిన బొమ్మే ఆడాలి. అది ఎన్డీడీవీ కావచ్చు. రిపబ్లికన్ టీవీ కావచ్చు.
అనుభవం: ‘కాలరెత్తుకు’ తిరగటమంటే, ‘డాలరెత్తుకుని’ తిరగటమే. ఇది అనుభవం నేర్పిన పాఠం. కానీ ‘హిండెన్‌బర్గ్’, నా కాలర్ని కాస్తా చైనీస్ కాలర్ని చేసేసింది.
మిత్రులు: నా షేర్లు ధబేల్ మన్నాయి కదా, ఒక్కడు మిగలడు.
శత్రువులు: సర్కారు అండ వుండగా ఆపత్కాలం కూడా, అమృత కాలంలాగానే వుంటుంది.
మిత్రశత్రువులు: అలాంటి కన్ఫ్యూజన్ పాలిటిష్యన్లకుంటుంది. మాకుండదు.
జీవిత ధ్యేయం: నిన్నటివరకూ విశ్వకుబేరుణ్ణే. కానీ హిండెన్‌బర్గ్ మాత్రం నన్ను విశ్వకుచేలుణ్ణి చెయ్యాలని కంకణం కట్టేసుకుంది.
సర్