ఇవ్వాళ రేపు సినిమా విడుదలకు ముందుగా నాన్ థియేటర్ డబ్బులు ఎంత వచ్చాయి అన్నదే కీలకం. సినిమా విడుదల నాటికే మాగ్జిమమ్ సేఫ్ అయిపోవాలి. ఇటీవలి కాలంలో శాటిలైట్ రైట్స్ అన్నా హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ కీలకంగా మారాయి.
నాని-రాహుల్ కాంబినేషన్ లో వెంకట్ బోయినపల్లి నిర్మించిన శ్యామ్ సింగ రాయ్ కు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మాంచి బేరం తగిలింది.
సాధారణంగా యాక్షన్ సీన్లు ఎక్కువగా వున్నవాటికి మంచి రేటు వస్తుంటుంది. కానీ శ్యామ్ సింగ రాయ్ విషయం వేరు. సినిమాలో బెంగాల్ బ్యాక్ డ్రాప్, నార్త్ జనాలు కనెక్ట్ అయ్యే కథాంశం వుండడంతో 10 కోట్లు పలికింది.
బి ఫోర్ యు టీవీ చానెల్ హిందీ డబ్బింగ్ రైట్స్ ను పది కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచింది.