అంతర్వేది రథంను దగ్ధం చేసిన ఘటనకు కారణమైన దోషులను కాపాడే అవసరం ఎవరికి ఉంది? అంతర్వేది వివాదం రాజకీయ రంగు పులుముకుంటే లాభపడేది ఎవరు?
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన జమా, ఖర్చులను కాగ్ క పరిధిలోకి తీసుకురావాలన్న సాహసోపేత నిర్ణయంపై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది ఎవరు?.. టీటీడీలో జరిగిన అక్రమాలపై కాగ్ నిగ్గు తేలుస్తుందని గుబులు పుట్టేది ఎవరికి? అంతర్వేది వివాదాన్ని రాద్ధాంతం చేస్తే.. కాగ్ గండం నుంచి తప్పించుకో గలరా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అసలు దోషులెవరు?
ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరొక తప్పు చేస్తే దానికి కారణమైన పాత్రధారుల తోపాటు తెర వెనుక ఉన్న సూత్రధారులు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే నిజాన్ని నిగ్గు తేల్చే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది.
పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి.. అనేక మంది ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనకు కారణమైన అసలు బాధ్యులకు శిక్ష పడకుండా, నివేదికను తొక్కిపెట్టిన నియంతృత్వ ప్రభుత్వం ఇప్పుడు లేదు.
తప్పు జరిగితే మళ్లీ అలాంటిది పునరావృతం కాకుండా దూరదృష్టితో చర్యలు తీసుకునే ప్రస్తుత ప్రభుత్వం… అంతర్వేది దుర్ఘటన వెనుక దోషులను తప్పకుండా గుర్తిస్తుంది..? ఈ ఘటనను అడ్డంపెట్టుకుని రాజకీయ వికృత క్రీడలకు తెరలేపిన వారి భరతం పడుతుంది.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అని విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటన ద్వారా నిరూపించుకున్న సీఎం జగన్.. తరచూ హిందూ ధార్మిక సంస్థలపై జరిగే దాడులను ఆసరాగా తీసుకుని, రాజకీయ లబ్ది పొందాలనుకున్న వారి దూకుడుకు కూడా కళ్లెం వేసేందుకు కొరడా ఝుళిపిస్తారు అనడంలో సందేహం లేదు.
ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది.