విజ‌య‌సాయి చేతిలో బాబుకు చాకిరేవు

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఒక మాటంటే, ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు వంద మాట‌లంటున్నారు. చంద్ర‌బాబు ఏదో ఒక విమ‌ర్శ చేయాల‌నే అత్యుత్సాహంతో చేసే ట్వీట్‌…చివ‌రికి ఆయ‌న గ‌తాన్ని త‌వ్వి తీయిస్తోంది. Advertisement…

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఒక మాటంటే, ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు వంద మాట‌లంటున్నారు. చంద్ర‌బాబు ఏదో ఒక విమ‌ర్శ చేయాల‌నే అత్యుత్సాహంతో చేసే ట్వీట్‌…చివ‌రికి ఆయ‌న గ‌తాన్ని త‌వ్వి తీయిస్తోంది.

అయినా బాబు ఊరుకునే ర‌కం కాదు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు అంత‌కంటే జ‌గ‌మొండి టైప్‌. దీంతో ప్ర‌తిదీ రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీస్తోంది. తాజాగా ఏపీలో అంత‌ర్వేది ఇష్యూ న‌డుస్తోంది. హిందువుల‌పై దాడికి టీడీపీ చిత్రీక‌రిస్తున్న నేప‌థ్యంలో…దాన్ని తిప్పి కొట్టేందుకు అధికార పార్టీ కూడా దీటైన‌ అస్త్ర శ‌స్త్రాల‌ను ప్ర‌యోగిస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి త‌న‌దైన శైలిలో బాబుపై ట్వీటాడారు. ఘాటైన ప‌ద‌జాలంతో బాబుపై దుమ్మెత్తి పోసిన ఆ ట్వీట్ల సంగ‌తేంటో చూద్దాం.

‘అంతర్వేది  ప్రమాదానికి కారుకులెవ‌రైనా వదిలేది లేదు. రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సర్కార్ రూ.95 లక్షలు మంజూరు చేసింది. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది’  అని విజ‌య‌సాయిరెడ్డి  పేర్కొన్నారు.

విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ఘాటైన ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్‌లో చంద్ర‌బాబు గ‌తంలో చేసిన ఘోర త‌ప్పిదాల‌న్నీ ఏక‌రువు పెట్టారు.

‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.’ అంటూ విమర్శించారు. బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు చాకిరేవును త‌ల‌పిస్తున్నాయంటే అతిశ‌యోక్తి కాదు.

ఉద్యాన ఉత్పత్తులతో ‘కిసాన్‌ రైలు’

ఆశలు వదిలేసుకున్నట్టేనా?