మొన్ననే లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. మరి అంతలోనే అతడికి కూతురు ఎక్కడ్నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారా? నిఖిల్-పల్లవి జంటకు పిల్లలు పుట్టడానికి ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే ఈలోపే వాళ్లు తమ పిల్లలకు సంబంధించి ఓ మాట అనుకున్నారు. ఒకవేళ కూతురు పుడితే ఆ పాపకు మాయ అనే పేరు పెట్టాలని ఈ జంట ఫిక్స్ అయింది.
నిఖిల్ కు మాయ అనే పేరు చాలా ఇష్టం అంట. అందుకే పల్లవితో డేటింగ్ స్టార్ట్ చేసిన 15-20 రోజులకే ఈ విషయంపై ఆమెతో డిస్కస్ చేశాడట. “నా కూతురు పేరు మాయ, నీకు ఓకేనా” అంటూ అప్పుడే ఆ విషయాన్ని డైరక్ట్ గా అడిగేశాడట.
ఇలా ఇంకా పుట్టని తన కూతురికి మాయ అనే పేరు పెట్టేశాడు నిఖిల్. ప్రస్తుతం ఈ హీరో తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత భార్యతో కలిసి చిన్న హనీమూన్ ట్రిప్ కూడా వెళ్లొచ్చాడు.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ హీరో. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై “18-పేజెస్” అనే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత కార్తికేయ-2 స్టార్ట్ అవుతుంది.