టికెట్ 250 అమ్మేసుకోండి?

''సంక్రాంతి టైమ్ లో ఎంతకు అమ్ముకుంటారో అమ్మేసుకోండి. పాత రేట్లు అమ్ముతారో, టికెట్ 250కి అమ్ముతారో మీ ఇష్టం. మీ జొలికి ఎవ్వరూ రారు…'' ఇలా అని మంత్రి పేర్ని నాని సినిమా జనాలకు…

''సంక్రాంతి టైమ్ లో ఎంతకు అమ్ముకుంటారో అమ్మేసుకోండి. పాత రేట్లు అమ్ముతారో, టికెట్ 250కి అమ్ముతారో మీ ఇష్టం. మీ జొలికి ఎవ్వరూ రారు…'' ఇలా అని మంత్రి పేర్ని నాని సినిమా జనాలకు హామీ ఇచ్చేసారట. ఈ మేరకు టాలీవుడ్ బిజినెస్ సర్కిళ్లలో విపరీతంగా వినిపిస్తోంది. 

జీవో 35 అమలు చేయమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా? అధికారులు ఎవ్వరూ మిమ్మల్ని అడగలేదు కదా? అని మంత్రి పేర్ని నాని తనను కలిసిన సినిమా పెద్దలతో అన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అందుకే ఆర్ఆర్ఆర్ 250 వంతున విక్రయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి వుంది కనుకే ఇాలాంటి టైమ్ లోనే తామూ రంగంలోకి దిగాలని భీమ్లా నాయక్ మేకర్లు ఆలోచిస్తున్నారు. 

ఇప్పుడు వదిలేస్తే, అందరితో పాటు భీమ్లా నాయక్ ను కూడా వదిలేస్తారు. లేదూ అంటే తరువాత సింగిల్ గా వస్తే, జీవో 35 అమలు చేయమని, కొత్త రేట్లు అమలు చేయమని పట్టుపడితే భీమ్లా నాయక్ ఇరుకున పడిపోతుంది.

మంత్రి ఇలా అన్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే భీమ్లా నాయక్ కూడా పండగ బరిలోనే దిగుతోంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కు ఆ వెసులుబాటు దొరికినపుడే తమకు కూడా దొరుకుతుంది కదా అన్నది ఆలోచన. 

అయినా సిఎమ్ జగన్ రేట్లు తగ్గిస్తే, మంత్రి అయి వుండి పేర్ని నాని ఇలా హామీ ఇచ్చారంటారా? నమ్మదగ్గ వార్తేనా? పండగ టైమ్ లో విచ్చలవిడిగా అమ్మకాలు జరిపేస్తే, అప్పుడు ఈ వార్తలు నిజమని నమ్మాల్సి వస్తుందేమో? ఆ మాత్రానికి రేట్లు తగ్గించి జగన్ అన్ పాపులర్ కావడం దేనికి?