బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే..అతడి ప్రియురాలు మలైకా ఆరోరాకు కూడా కరోనా పాజిటివ్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మలైకా సోదరి ప్రకటించింది.
ఇలా ప్రేమికులిద్దరూ కరోనా బారిన పడినట్టుగా ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో కొందరు ప్రేమికులు దూరదూరం అయిపోయారు. ఈ మధ్యకాలంలో మినహాయింపుల నేపథ్యంలో మళ్లీ ప్రేమికులకు కలిసి గడిపేంత సమయం దక్కుతున్నట్టుగా ఉంది. మరీ వీరిద్దరూ ఒకరి వల్ల ఒకరు కరోనా బారిన పడ్డారో లేక వేర్వేరు కారణాల వల్ల వీరిద్దరికీ ఒకే సమయంలో కరోనా పాజిటివ్ గా తేలిందో కానీ.. ప్రేయసీ ప్రియులు గురించి స్వల్ప గ్యాప్ తో ఈ ప్రకటన లు వచ్చాయి.
ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు కరోనా ను జయించి ఇళ్లకు చేరుకున్నారు. మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి అత్యంత పతాక స్థాయిలో ఉంది. ఈ క్రమంలో ముంబైలోని కొందరు ప్రముఖులు కూడా ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోలేకపోయినట్టున్నారు.