లావణ్యకు అంత సీన్ వుందా?

ఈరోజు వున్నట్లుండి ఓ గ్యాసిప్ గుప్పుమంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో లావణ్య త్రిపాఠీ రెండో హీరోయిన్ అంటూ. నిజానికి లావణ్యకు అంత సీన్ వుందా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  Advertisement అసలు ఆ…

ఈరోజు వున్నట్లుండి ఓ గ్యాసిప్ గుప్పుమంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో లావణ్య త్రిపాఠీ రెండో హీరోయిన్ అంటూ. నిజానికి లావణ్యకు అంత సీన్ వుందా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అసలు ఆ సినిమాలో రెండో హీరోయిన్ వుండే చాన్స్ వుందా? సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ తో పాటు కజిన్ లేదా మరొకరు అంటూ ఇంకో అమ్మాయి వుండడం కామన్. 

అలా వుంటే గింటే ఆ చాన్స్ ఈసారి శ్రీలీల కు వెళ్తుంది అని తెలుస్తోంది. శ్రీలీల అంటే ఈ మధ్యనే పెళ్లి సందడి సినిమాలో నటించి అందరి దృష్టిని లాగేసింది. ఆ తరువాత రవితేజ సినిమాలో, దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. 

అందువల్ల మహేష్ సినిమాలో కనిపించాలంటే ఆ మాత్రం క్రేజ్ వుండాలి. లేదూ చెల్లెలు, ఏదో చిన్న పాత్ర అయితే అప్పుడు లావణ్య సంగతి ఆలోచిస్తారేమో? ఇదీ యూనిట్ వర్గాల బోగట్టా.