పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాల లుక్ లు, ప్రకటనలు వచ్చేసాయి. వీటిలో భలే ఆకట్టుకుంది డైరక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్. మోడరన్ బైకు, దానిపై పెద బాలశిక్ష, వెనుక బ్యాక్ డ్రాప్ లో ఇండియా గేట్. వీటన్నింటికి అదనంగా ఈసారి కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు అనే క్యాప్షన్. ఇవన్నీ కాస్త ఆలోచింపచేసాయి.
వాస్తవానికి ఇలాంటి కాన్సెప్ట్ పోస్టర్లు కొత్తగా డిఫరెంట్ సినిమా తెసే డైరక్టర్లు వదులుతుంటారు. హరీష్ శంకర్ లాంటి పెద్ద డైరక్టర్లు కేవలం హీరో లుక్ మాత్రమే వదులుతుంటారు. కానీ ఈసారి ఇలా డిఫరెంట్ ప్రయోగం చేసేసరికి పవర్ స్టార్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ కూడా ఆలోచనలో పడ్డారు.
ఏతరహా సినిమా చేయబోతున్నారు హరీష్ శంకర్ అని. ఏదైనా పోలిటికల్ టచ్ మెసేజ్ ఇవ్వబోతున్నారా? మళ్లీ యూత్ సింబల్ గా ఆ బైకు పెట్టారు కదా? అంటే యాత్రీకుడా? హీరో? ఇలా రకరకాలుగా.
కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, పవన్ ఇంకా ఈ సినిమాకు కథ ఓకె చేయలేదన్నది. రెండు మూడు థీమ్ లు లేదా కాన్సెప్ట్ పవన్-హరీష్ డిస్కస్ చేసిన మాట వాస్తవం అని, కానీ ఏ స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదన్నది పవన్ సన్నిహిత వర్గాల బోగట్టా. వన్స్ హరీష్ చెప్పిన రెండు మూడు లైన్లలో ఏదో ఒకటి ఇంకా పవన్ ఫైనల్ చేసుకోవాల్సి వుందట.
అయితే హరీష్ మదిలో వున్న కాన్సెప్ట్ కు అనుగుణంగా ఈ పోస్టర్ వదిలి వుండోచ్చు. దీని మీదే ఆయన ఎక్కువ ఆసక్తితో వుండి వుండొచ్చు.