మ‌నిషి ఎరుపు …. మ‌న‌సు ప‌సుపు

సీపీఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌. ఈయ‌న రాయ‌ల‌సీమ వాసి. పుట్టింది, పెరిగింది క‌ర్నూలు జిల్లాలో. కానీ విద్యార్థి సంఘం నాయ‌కుడిగా ఎదిగింది మాత్రం అనంపురం జిల్లాలో. ఆ త‌ర్వాత అనంత‌పురం అసెంబ్లీ స్థానం…

సీపీఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌. ఈయ‌న రాయ‌ల‌సీమ వాసి. పుట్టింది, పెరిగింది క‌ర్నూలు జిల్లాలో. కానీ విద్యార్థి సంఘం నాయ‌కుడిగా ఎదిగింది మాత్రం అనంపురం జిల్లాలో. ఆ త‌ర్వాత అనంత‌పురం అసెంబ్లీ స్థానం నుంచి ఒక‌సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  కె.నారాయ‌ణ త‌ర్వాత‌ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా  రామ‌కృష్ణ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కానీ ఈయ‌న మ‌న‌షి మాత్ర‌మే ఎరుపు, మ‌న‌సు మాత్రం ప‌సుపు అని సొంత పార్టీ శ్రేణులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి కుడి భుజంగా మెలుగుతార‌నే పేరు రామ‌కృష్ణ‌కు ఉంది. కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదులే…అనుకున్నాడో ఏమో తెలియ‌దు కానీ, సొంత పార్టీ సీపీఐ కంటే టీడీపీ అధికార ప్ర‌తినిధి బాధ్య‌త‌ల‌నే ఎక్కువ భుజాన మోస్తున్నార‌ని క‌మ్యూనిస్టు కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం.

మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంలో రామ‌కృష్ణ అత్యుత్సాహానికి సొంత జిల్లా క‌ర్నూలు సీపీఐ కార్య‌క‌ర్తులు బ్రేక్ వేశారు. ‘ఏమ‌య్యా నీకు ఇదేం పోయే కాలం. ఎంత సేపూ టీడీపీ ఎజెండాను భుజాన మోసే ప‌నేనా? సీమ‌కు క‌నీసం హైకోర్టు కావాల‌ని అడిగేదేమైనా ఉందా’ అని నేరుగా అడిగే స‌రికి తోక ముడిచి ప‌రార‌య్యాడు.

ఆ మ‌ధ్య ఓ ప్ర‌ముఖ చాన‌ల్ డిబేట్‌లో రామ‌కృష్ణను బీజేపీ యువ‌నాయ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి గుక్క తిప్పుకోకుండా కొట్టిన కొట్టు కొట్ట‌కుండా కొట్టాడు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చ‌ద‌వ‌డానికి మీకు స‌రిపోయింద‌ని, వాళ్లు చెప్పిన‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప‌నిలో మునిగి తేలుతున్నార‌ని రామ‌కృష్ణ‌ను విష్ణు నేరుగా దుమ్ము దులిపాడు. దీంతో ఏం మాట్లాడాలో రామ‌కృష్ణ విల‌విల‌లాడాడు. స‌హ‌జంగా క‌మ్యూనిస్టు నేత‌లంటే నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అన్ని పార్టీల నేత‌లు చాలా జాగ్ర‌త్త‌గా, గౌర‌వంగా మాట్లాడేవారు.

అంతెందుకు సీపీఎం నేత‌ల‌ను ఎవ‌రూ కూడా రామ‌కృష్ణను విమ‌ర్శించిన‌ట్టు మాట్లాడ‌రు. దానికి కార‌ణం సీపీఎం నేత‌లు దేనిపై ఎంత వ‌ర‌కు మాట్లాడాలో, అంత వ‌ర‌కే ప‌రిమిత‌మై త‌మ హ‌ద్దులు తెలుసుకుని ప్ర‌వ‌ర్తించ‌డ‌మే. కానీ తోటి వామ‌ప‌క్ష పార్టీ నుంచి కూడా సీపీఐ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏ మాత్రం గుణ‌పాఠం నేర్వ‌డం లేదు.

తాజాగా రామ‌కృష్ణ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న చూస్తే…ఆయ‌న సీపీఐ కార్య‌ద‌ర్శా లేక టీడీపీ అధికార ప్ర‌తినిధిగా ప్ర‌శ్నిస్తున్నారో అర్థం కాదు. చిత్తూరు జిల్లాలో ద‌ళితుల ఆత్మ‌హ‌త్య‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కార‌ణ‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీనిపై  ఆధారాలు ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు మ‌ద‌న‌ప‌ల్లె డీఎస్పీ నోటీసులిచ్చారు. పాపం త‌న ఆరాధ్య నాయ‌కుడికి పోలీసులు నోటీసులు ఇవ్వ‌డం రామ‌కృష్ణ‌కు ఎక్క‌డో నొప్పి క‌లిగింది.

బాబుకు క‌ష్టం రాగానే…నేనున్నా అంటూ ఆయ‌న తెర‌పైకి వ‌చ్చాడు.  చంద్ర‌బాబుకు నోటీసులు ఇవ్వ‌డం త‌న‌కు చాలా ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా రామ‌కృష్ణ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఏముందంటే…

‘దళిత యువకుడు ఓం ప్రతాప్ మరణంపై చంద్రబాబు.. డీజీపీకి లేఖ రాస్తే ఆయన లేఖపై పోలీసులు ఈ విధంగా స్పందించా రంటే భవిష్యత్‌లో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరికీ ఉత్తరాలు రాయకుండా చేయాలనుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల ఉత్తరాలు రాస్తే మిమ్మలనే విచారణకు పిలుస్తాం అన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుపుతుందా? లేక జగన్ ఏకపక్ష రాజ్యం నడుస్తుందో ఆర్థం కావడం లేదు.

మాస్క్‌లు, పీపీఈ కిట్స్ లేవని డాక్టర్ సుధాకర్ చెబితే ఆయనపై పోలీసులతో దాడి చేయించడమే కాకుండా ఆయనను పిచ్చివాడిగా ముద్ర వేశారు. ఇసుక మాఫీయాకు వ్యతిరేకంగా ఒక దళిత యువకుడు గొంతు ఎత్తితే ఆతనికి పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పోలీస్ డ్రస్ వేసుకుని పాలన చేస్తే సరిపోతుంది. లేకపోతే జగన్ ఇడుపులపాయలో కూర్చుని రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే ఆయన పరిపాలన చేస్తారు. ప్రతిపక్ష నేతకు పోలీసులు నోటీలు ఇచ్చారంటే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆర్థమైపోతుంది’ అని పేర్కొన్నాడు.

చంద్ర‌బాబుకు నోటీసులు ఇవ్వ‌డంపై టీడీపీ నేత‌లే ఏమీ మాట్లాడ‌లేదు. అలాంటిది చంద్ర‌బాబు మెప్పు కోసం టీడీపీ వాయిస్‌ను సీపీఐ ముసుగులో రామ‌కృష్ణ క‌మ్మ‌గా వినిపిస్తున్నాడు. మ‌న‌సంతా చంద్ర‌బాబు పెట్టుకుని…ఎందుకీ రాజ‌కీయ వ్య‌భిచారం?  హాయిగా టీడీపీలో చేరి మ‌రింత బ‌లంగా , ఆ పార్టీ కార్యాల‌యం నుంచే చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డొచ్చు క‌దా? గ‌తంలో ప్ర‌త్యేక హోదా గురించి ఆందోళ‌న‌లు చేస్తే రెండు వారాల పాటు జైలు పాలు చేసిన ప్ర‌జాస్వామ్య పితామహుడికి తాను వంత పాడుతున్నాన‌నే విష‌యాన్ని  రామ‌కృష్ణ మ‌రిచిపోయిన‌ట్టున్నాడు.

అలాంటి మాజీ పాల‌కుడికి సిగ్గు లేకుండా మ‌ద్ద‌తుగా రోజూ మీడియా ముందుకు రావ‌డం అంటే క‌మ్యూనిజం మూల సిద్ధాం తాన్ని ప్ర‌తిరోజూ త‌గ‌ల‌బెట్ట‌డ‌మే. ఎందుక‌య్యా అంత గొప్ప సిద్ధాంతాన్ని ఇంత‌గా హింస పెడ‌తారు. సీపీఎం నేత‌ల‌కు ఇప్ప‌టికీ అంతోఇంతో గౌర‌వం ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సీపీఐనే. 

ఎందుకంటే సీపీఐ నేత‌ల‌తో పోల్చుకుంటే సీపీఎం నేత‌ల‌కు ఇంకా విలువ‌లుండ‌డ‌మే. అవున్లే మ‌నిషి మాత్ర‌మే ఎరుపు…మ‌న‌సంతా ప‌సుపు అయిన‌ప్పుడు ఏవి మాత్రం జ్ఞాప‌కం ఉంటాయ్‌?  

రైటింగ్ లో భలే మజా వస్తుంది

ఇడుపులపాయలో జగన్