లోకేష్.. డోంట్ కేర్ అంటున్న ఎల్లో మీడియా

ఇప్పుడు ఎల్లో మీడియా అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. లోకేష్ కు ఎలివేషన్లు ఇవ్వడం ఆపేసింది. ఒకప్పుడు లోకేష్ ట్విట్టర్ లో కూసినా అది బ్యానర్ ఐటెమ్ గా కూర్చునేది.  Advertisement కానీ ఇప్పుడు…

ఇప్పుడు ఎల్లో మీడియా అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. లోకేష్ కు ఎలివేషన్లు ఇవ్వడం ఆపేసింది. ఒకప్పుడు లోకేష్ ట్విట్టర్ లో కూసినా అది బ్యానర్ ఐటెమ్ గా కూర్చునేది. 

కానీ ఇప్పుడు లోకేష్ నేరుగా రోడ్లపైకొచ్చి హంగామా చేస్తున్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దానికంటే, బాబు ఇచ్చే చిన్న స్టేట్ మెంట్ నే ఎక్కువగా హైలెట్ చేస్తోంది. ఎందుకీ మార్పు..?

జాకీలు కూడా పనికిరావు…

లోకేష్ ని లేపేందుకు చాలా జాకీలే పనిచేశాయి. కానీ అది సాధ్యం కావడంలేదు. సాధ్యం కాదని కూడా తేలిపోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా చంద్రబాబుపై ఉన్న గౌరవం లోకేష్ పై లేదు. లోకేష్ తెల్లగడ్డం కనిపించేలా కవర్ చేసుకున్నా.. ఆయనకింకా పొలిటికల్ మైనార్టీ తీరలేదనే భావిస్తున్నారు నేతలు. 

ఓ దశలో చంద్రబాబు తన ప్రాధాన్యం తగ్గించుకుని మరీ లోకేష్ కోసం కష్టపడ్డారు. కానీ అది మొదటికే మోసం తెచ్చిపెట్టిందని తెలుసుకున్నారు. స్టాండ్ మార్చారు. దీంతో టీడీపీ అనుకూల మీడియా కూడా స్టాండ్ మార్చేసింది.

లోకేష్ తో లాభం కంటే నష్టమే ఎక్కువ..

లోకేష్ ఫేస్ కనపడినా, ఆ ఫేస్ తో బ్యానర్ వేసినా దానికి పెద్దగా వాల్యూ ఉండడం లేదు. అదే చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలు పెడితే.. దానికి టీడీపీ కార్యకర్తల్లో ఉండే క్రేజ్ ఎక్కువ. లోకేష్ ని ముందుంచి నడిస్తే జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. 

నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లోకేష్ లో లేవు కాబట్టి, పార్టీ కూడా చిందరవందర అవుతుండి, క్యాడర్ చెల్లాచెదరవుతుంది. కనీసం చంద్రబాబు ఉన్నంతవరకు పార్టీ పటిష్టంగా ఉండాలన్నా.. ఆయన ఫేస్ హైలెట్ కావాల్సిందే. అందుకే ఎల్లో మీడియాకు ఈ కష్టాలన్నీ..

ముందు బాబు.. తర్వాతే లోకేష్..

2024 ఎన్నికలు టీడీపీకి చావో రేవో తేల్చాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు.. అనేలా టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. దీంతో బాధ్యత మళ్లీ చంద్రబాబుపై పడింది. ముందు చంద్రబాబుని సీఎంగా చేయాలి, ఆ తర్వాతే లోకేష్ వ్యవహారం అని డిసైడ్ అయింది ఆ పార్టీ అనుకూల మీడియా. 

అందుకే లోకేష్ ని పూర్తిగా పక్కనపెట్టేసింది. బ్యానర్ ఐటమ్ అయినా, బాక్స్ ఐటమ్ అయినా.. అన్నీ చంద్రబాబు స్టేట్ మెంట్ లే. ముంబు బాబుకి ఎలివేషన్ ఇచ్చి, ఆ తర్వాత మిగతా సంగతి అనే లెక్కలోకి వచ్చేశారంతా.

చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి..

వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ప్రచారం ఇప్పటినుంచే మొదలు పెట్టింది టీడీపీ. మళ్లీ బాబే రావాలి, మళ్లీ నువ్వే రావాలి అంటూ ముందుగానే స్లోగన్లు రెడీ చేస్తున్నారంటే.. దాని అర్థం అదే. ఒకవేళ అన్నీ అనుకూలించి టీడీపీకి మెజార్టీ వస్తే అప్పుడు లోకేష్ సంగతి చూడొచ్చు. 

కానీ లోకేష్ పేరుతో మాత్రం ప్రచారం జరక్కూడదు. ఇదీ టీడీపీ స్ట్రాటజీ. ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందునుంచీ అనుకూల మీడియాతో దీన్ని అమలులో పెట్టారు బాబు.