న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో టీడీపీకి మరెవరూ సాటిరారు. టీడీపీ నేతలకు చట్టంపై ఉన్న చైతన్యం ఎలాంటిదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
మిగిలిన పోయిన స్థానిక సంస్థల ఎన్నికలు మరో నాలుగైదు రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఎన్నికలపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు నుంచి టీడీపీ సాధించుకున్న ఆదేశాలేంటో తప్పక తెలుసుకోవాలి. గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో తమను అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులు బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదిస్తూ అభ్యర్థులకు పోలీసు రక్షణతో పాటు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయాలని కోరారు.
వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే వెబ్ కాస్టింగ్‌పై ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది.
న్యాయం ఎలా పొందాలో టీడీపీని చూసి ఎవరైనా నేర్చుకోవాలంటే …కాదనే వాళ్లు ఎవరుంటారు? న్యాయం పొందడం పౌరుల హక్కు కదా. అదే టీడీపీ వాళ్లు సమర్థవంతంగా చేస్తున్నారు.