మూవీ ఫ్లాప్.. ట్రెండింగ్ సూపర్ హిట్

సరిగ్గా ఏడాది కిందటి సంగతి..ఇదే రోజు ప్రభాస్ హీరోగా నటించిన “సాహో” సినిమా థియేటర్లలోకి వచ్చింది. అప్పట్లో ఆ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. “బాహుబలి-2” లాంటి చరిత్ర తర్వాత వస్తున్న సినిమా కావడంతో…

సరిగ్గా ఏడాది కిందటి సంగతి..ఇదే రోజు ప్రభాస్ హీరోగా నటించిన “సాహో” సినిమా థియేటర్లలోకి వచ్చింది. అప్పట్లో ఆ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. “బాహుబలి-2” లాంటి చరిత్ర తర్వాత వస్తున్న సినిమా కావడంతో “సాహో”పై ఎక్స్ పెక్టేషన్స్ ఊహించలేని విధంగా పెరిగిపోయాయి. అన్ని అంచనాల్ని అందుకోవడం ఏ సినిమాకైనా కష్టమే. ప్రభాస్ కు కూడా అదే సమస్యగా మారింది.

ఆకాశాన్నంటిన అంచనాల్ని అందుకోవడంలో “సాహో” విఫలమైంది. అలా ఓ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఫెయిల్యూర్ చూడాల్సి వచ్చింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వసూళ్లలో మాత్రం ఈ సినిమా దుమ్ముదులిపింది. భారీ బడ్జెట్ కారణంగా బ్రేక్-ఈవెన్ అవ్వకపోయినా.. కలెక్షన్లు మాత్రం కళ్లుచెదిరేలా వచ్చాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా పెద్ద హిట్టయింది.

ఇవన్నీ ఒకెత్తయితే 'అజ్ఞాతవాసి' సినిమానే తిప్పి తీశారని, 'లార్గోవించ్' సినిమాను మరింత స్టయిలిష్ గా కాపీ కొట్టారనే విమర్శలు అప్పట్లో “సాహో”ను బాగా దెబ్బకొట్టాయి. 

ఇలా ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాలు, ఇంకెన్నో విశ్లేషణలకు మూలబిందువైంది సాహో.

ఈరోజుతో ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయింది. నిజానికి తెలుగులో ఫ్లాప్ అయిన ఇలాంటి సినిమాను పట్టించుకోనవసరం లేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో పట్టించుకున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాను ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా ఫ్లాప్ అయినా భారీ కలెక్షన్స్ వచ్చాయంటే దానికి మా ప్రభాసే కారణం అంటున్నారు.

అన్నట్టు ఈ సినిమా ఇంకా టీవీల్లో ప్రసారం కాలేదు. ఈమధ్యే జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. కానీ ఇంకా టెలికాస్ట్ చేయలేదు. ఈరోజు టెలికాస్ట్ చేసి ఉంటే బాగుండేది.

పవన్ సార్ గురించి ఏం చెప్పాలి