‘భయో’ డేటా: ‘షో’ బాబు!

నా పేరు: నారా చంద్రబాబు నాయుడు  Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: రోడ్‌ కింగ్‌ ( రోడ్ల మీద షో చెయ్యటంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాను. వచ్చిన వారే కాదు, వచ్చి ‘పోయిన’ వారిని లెక్కించినా…

నా పేరు: నారా చంద్రబాబు నాయుడు 

దరఖాస్తు చేయు ఉద్యోగం: రోడ్‌ కింగ్‌ ( రోడ్ల మీద షో చెయ్యటంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాను. వచ్చిన వారే కాదు, వచ్చి ‘పోయిన’ వారిని లెక్కించినా మన రికార్డును ఎవరూ కొట్ట లేరు.)

వయసు: అదే కదా చెబుతుంటా..? యువకుల్ని నమ్ముకోలేక పోతున్నాను. ( లోకేష్‌ గురించి కాదు) అందుకే నాలాంటి వృధ్ధులే మేలని భావిస్తున్నా. 

ముద్దు పేర్లు: ‘షో’ బాబు. ఎక్కడిక్కడ రోడ్డు షోలు చేస్తున్నాను కదా!

విద్యార్హతలు: పొత్తుల్లో పీహెచ్‌డి. ఎప్పుడయినా పొత్తులేకుండా పార్టీని గెలిపించానా? ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో.. దేశంలో ఎవరయినా నా నుంచే నేర్చుకోవాలి…! చూస్తూ వుండండి ‘చెప్పు’ చేతల్లో వుండే వారితోనే పొత్తు వుంటుంది. 

విలాసం: తెలియటం లేదా? ఎప్పుడూ రోడ్డు మీదా వుంటున్నది. అలాంటిది ‘రోడ్ల మీదకు రావద్ద’ంటారా?’

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: అమరావతి. (ఒకప్పుడు దేశరాజకీయాల చక్కబెట్టేవాడిని. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను చక్కబెట్టాను. ఇప్పుడు అమరావతిలో చిక్కుకున్నాను. రైతు గురించి మాట్లాడుతుంటే.. అమరావతి గురించా? అని అడుగుతున్నారు.)

రెండు: చై. నా ( అబ్బే ఏం లేదు. చైతన్య, నారాయణ వంటి విద్యాసంస్థలు నా హయాంలోనే అభివృద్ధి చెందాయి లెండి.)

సిధ్ధాంతం: యూజ్‌ అండ్‌ త్రో ( అని ఒకప్పుడు ఆడి పోసుకునేవారు.) కానీ, నా దగ్గర ఆశ్రయం పొంది ఎదిగిన వాణిజ్య వేత్తలే, నేను ప్రతిపక్షంలోకి వచ్చాక ఈ సిధ్ధాంతాన్ని నా మీద అమలు జరిపారేమో!

వృత్తి: ఒట్టు. రాజకీయం తప్ప మరో వృత్తి తెలీదు. కాబట్టే అన్నేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో వుండగలిగాను.  

హాబీలు: 1. రియల్‌ ఎస్టేట్‌ అని అనుకుంటారు. దాని గురించి నాకేమీ తెలీదు. కానీ హైదరాబాద్‌ ను నేను డెవలప్‌ చేసినప్పుడు అక్కడ రియల్‌ ఎస్టేట్‌ పెరిగింది. అదే ఊహతో అమరావతి ని చూశారు. తప్పు నాదా..? 

2. నేతల్ని సృష్టించటం. నా దగ్గర ఎవరయినా ఎదుగుతారు. లోకేషే కొంచెం టైమ్‌ తీసుకుంటున్నాడు. తొందరేముంది లెండి!

అనుభవం: నేనిక్కడ ఏం చేస్తానో,  కేసీఆర్‌ అక్కడ అదే చేస్తారు. ఆయన బీఆర్‌ఎస్‌ పెట్టి ఆంధ్రకు వస్తున్నారా? నేనేమో కాసాని జ్ఞానేశ్వర్‌ ను చూపించి, తెలంగాణ వెళ్తున్నాను.

మిత్రులు: అంతా అమరావతిలోనే కాదు. బయిట కూడా వుంటారంటే నమ్మేటట్లుగా లేరు. ఏం చేసేదీ..? 

శత్రువులు: మాటిమాటికి నా వయసును గుర్తు చేసేవారు. నా ఫిట్‌నెస్‌ గురించి వారికేం తెలుసు? అందుకే చెట్లూ, పుట్టలూ, బస్సు టాపులూ.. ఏవి కనపబడితే అవి అధిరోహిస్తున్నా?  

మిత్రశత్రువులు: స్క్రిప్టు ఇచ్చినా, యాక్ట్‌ చెయ్యలేని నటులు. 

జీవిత ధ్యేయం: అతి వృధ్ధ ముఖ్యమంత్రి గా దేశంలో పేరు తెచ్చుకోవాలి. 

సర్‌