బీజేపీ, టీడీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా చిచ్చు

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీపై తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది. బీజేపీపై విమ ర్శ‌లు చేయ‌డానికి ద‌మ్ము, ధైర్యం లేని టీడీపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ తదిత‌ర నాయ‌కులు…సోష‌ల్ మీడి…

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీపై తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది. బీజేపీపై విమ ర్శ‌లు చేయ‌డానికి ద‌మ్ము, ధైర్యం లేని టీడీపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ తదిత‌ర నాయ‌కులు…సోష‌ల్ మీడి యాను అడ్డుపెట్టుకుని నాట‌కాలకు తెర‌లేపారని ఆ పార్టీ ఏపీ నేత‌లు మండిప‌డుతున్నారు. టీడీపీ వ్య‌వ‌హారంపై బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా ఆ రెండు పార్టీల మ‌ధ్య సోష‌ల్ మీడియా చిచ్చు రేపింది.

ముఖ్యంగా టీడీపీ ఎత్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చిత్తుచేస్తున్న బీజేపీ నాయ‌కులు జీవీఎల్ నర‌సింహారావు, సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి లాంటి నాయ‌కుల‌ను టీడీపీ సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేసింది. ఈ ప‌రంప‌ర‌లో జీవీఎల్ న‌ర‌సింహారావుపై రెండురోజుల క్రితం సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టింది. వీటిపై విజ‌య‌వాడ‌కు చెందిన బీజేపీ కార్య‌క‌ర్త ఫిర్యాదు మేర‌కు భీమ‌వ‌రానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త పెద్ద‌నేని ర‌మ‌ణ‌య్య‌, జై తెలుగుదేశం, టీడీపీ యూత్ ఫేస్‌బుక్ పేజీల‌తో పాటు మ‌రికొంద‌రిపై సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించాల‌ని టీడీపీ ప‌న్నిన కుట్ర‌ల‌ను ప‌సిగ‌ట్టిన బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అప్ర‌మ త్త‌మైంది. ఈ మేర‌కు ఏపీ బీజేపీ శాఖ ఓ హెచ్చ‌రిక జారీ చేసింది. బీజేపీ జాతీయ‌, రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాల‌తో త‌ప్పుగా, అభ్యంత‌ర‌క‌ర రీతిలో ప్ర‌చారం చేసే వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ‌, క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ హెచ్చ‌రిస్తూ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. విదేశాల్లో ఉంటూ త‌మ‌పై విష ప్ర‌చారం చేసే వారిపై సంబంధిత దేశాల్లోని ఇండియ‌న్ ఎంబ‌సీకి స‌మాచారం అందించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా తీవ్ర హెచ్చ‌రిక‌లు పంపింది.

ఇటీవ‌ల ఫోన్ ట్యాపింగ్‌పై ప్ర‌ధాని మోడీకి టీడీపీ అధినేత చంద్ర‌బాబు లేఖ రాయ‌డంపై ఢిల్లీ వేదిక‌గా జీవీఎల్ నర‌సింహారావు, ట్విట‌ర్‌లో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి చీల్చి చెండాడారు. ఇక ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సోము వీర్రాజైతే…టీడీపీపై వీర విహారం చేస్తున్నారు. గ‌తంలో ప్ర‌ధాని మోడీని, బీజేపీని చంద్ర‌బాబు ఎంత నీచంగా మాట్లాడారో గుర్తు చేస్తూ వారి పోస్టింగ్‌లు, మీడియా మీట్‌లు టీడీపీకి బాగా డ్యామేజ్ అయ్యాయి. 

బీజేపీ అటాకింగ్‌ను జీర్ణించుకోలేని టీడీపీ సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ప‌రిత‌పిస్తోంది. దీన్ని ఆదిలోనే బీజేపీ అంత‌మొందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. టీడీపీ సోష‌ల్ మీడియా కుట్ర‌ల‌పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న‌దైన శైలిలో దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీ కార్యాలయం నుంచి అనధికార వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల పేరుతో ప్రచారం ఎందుకని ప్ర‌శ్నించారు. ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్ సైట్‌లో, అధికారిక మాధ్యమాల్లో ప్రచారం చేయండని విష్ణు స‌వాల్ విసిరారు.  ప్రధాని మోడీని ఓ వైపు చంద్ర‌బాబు పొగుడుతూ లేఖ రాస్తూ, మ‌రోవైపు ఏపీలో మాత్రం బీజేపీ నేతలను తిట్టాల‌ని తమ్ముళ్లను ప్రోత్స‌హిస్తారా అని మండిప‌డ్డారు. ఇదేం రాజకీయం అని నిల‌దీశారు.  మొత్తానికి టీడీపీ, బీజేపీ మ‌ధ్య రోజురోజుకూ వైరం పెరుగుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు.

కమ్మ వారికి చంద్రబాబు చేస్తున్న నష్టం ఎంత