అలియా భట్, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్రెడీ తల్లులయ్యారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరబోతోంది. ఆమె పూర్ణ. తను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ స్వయంగా ఈ నటి ప్రకటించింది.
ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంది పూర్ణ. దుబాయ్ కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. అతడితో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు తన వైవాహిక జీవితంలో మరో అధ్యాయంలోకి అడుగుపెడుతోంది.
తెలుగులో కొన్ని మంచి సినిమాల్లో నటించింది పూర్ణ. అయితే ఆమెకు అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదు. దీంతో ఒక దశలో టెలివిజన్ కార్యక్రమాల వైపు ఆమె మళ్లింది. అక్కడ మాత్రం ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఎన్నో టీవీ కార్యక్రమాల్లో పూర్ణ ఇచ్చిన డాన్స్ షోలకు మంచి గుర్తింపు వచ్చింది.
అలా చాన్నాళ్లుగా టీవీకే అతుక్కుపోయిన పూర్ణ, ఈ ఏడాది పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది. ఇప్పుడు బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అయింది.