ఇద్దరు బాబుల గాలి తీసేసిన సంచయిత?

ఆరు నెలలు అయింది. ఏపీ జనాలకు ముఖం చూపించి. పెదబాబు చంద్రబాబు, చినబాబు లోకేష్ బాబు హైదరాబాద్ లో వందల కోట్లతో కట్టిన విలాసవంతమైన భవనంలో ఉంటూ ఏపీ మీద రాళ్ళేస్తున్నే ఉన్నారు. Advertisement…

ఆరు నెలలు అయింది. ఏపీ జనాలకు ముఖం చూపించి. పెదబాబు చంద్రబాబు, చినబాబు లోకేష్ బాబు హైదరాబాద్ లో వందల కోట్లతో కట్టిన విలాసవంతమైన భవనంలో ఉంటూ ఏపీ మీద రాళ్ళేస్తున్నే ఉన్నారు.

మరి ఎక్కడో ఉన్న వారికి ఏపీలో విషయాలు ఎలా తెలుస్తాయి. అంటే ఎవరో చెప్పినవి, కట్టుకధలను ఏర్చి కూర్చి  పచ్చి నిజాలుగా మార్చి ట్వీట్లు చేస్తూ అదే తమ రాజకీయం అనుకుంటున్న ఇద్దరు బాబులకు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు గట్టిగా పంచ్ లే వేశారు.

విలాసవంతమైన భవనాల్లో కూర్చోని రాల్ళేయడం కాదు, ఫేస్ బుక్ ప్రచారం కట్టిపెట్టండి, నిజాలను తెలుసుకోండి అంటూ బాగానే కౌంటర్లేశారు. అసలు ఇంతకీ సంచయితకు ఇంతలా కోపం రావడానికి కారణం మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదని, వారు బిక్షాటన చేసుకుంటున్నారని లోకేష్  ట్వీట్  చేస్తూ సంచయిత మీద, జగన్ మీద కూడా విరుచుకుపడ్డారు.

దానికి సంచయిత ఇచ్చిన రిటార్ట్ అదిరిపోయింది. ఈ నిర్వాకం అంతా తన బాబాయ్ అశోక్ గజపతి రాజు టైంలోదేనని, నాడే మన్సాస్ కి  20 కోట్ల బకాయిలు పెట్టారని, అపుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబేనని కూడా లోకేష్ కి మొత్తం విషయం చెప్పి కళ్ళు తెరిపించే యత్నం చేశారు.

తాను చైర్ పర్సన్ గా వచ్చాక పెండింగు బకాయిలు కూడా తీరుస్తూ మొత్తం సర్దుతున్నానని చెప్పుకొచ్చారు.  మాన్సాస్ పై  ఏమీ తెలియకుండా తన మీద రాళ్ళేసే దుష్టత్వాన్ని ఇద్దరు బాబులూ ఇకనైనా ఆపుతారని ఆశిస్తున్నానని సంచయిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనితోనైనా చినబాబు మాన్సాస్  ట్రస్ట్ అన్న మాటను  వదిలేస్తారా.. ఏమో.

దిల్ రాజు ముందు చూపు

చంద్ర‌బాబు ఆట‌లో పావులు