కొంపముంచిన పెళ్లి.. 500 మందికి కరోనా భయం

వేగంగా విస్తరిస్తున్న కరోనాతో జాగ్రత్తగా ఉండాలని, శుభాకార్యాల్లో 30-40 మందికి మించి పాల్గొనకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించిన కొంతమందిపై కేసులు నమోదైన దాఖలాలు…

వేగంగా విస్తరిస్తున్న కరోనాతో జాగ్రత్తగా ఉండాలని, శుభాకార్యాల్లో 30-40 మందికి మించి పాల్గొనకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించిన కొంతమందిపై కేసులు నమోదైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓవైపు ఇంత జరుగుతుంటే మరోవైపు మాత్రం కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా క్యారియర్స్ గా మారుతున్నారు.

విశాఖ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు కొత్త తంటా తెచ్చిపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 500 మందికి భోజనాలు వడ్డించారు. అంతా సాఫీగా అయిపోయిందనుకున్న టైమ్ కు ఏకంగా పెళ్లికొడుక్కి కరోనా సోకినట్టు నిర్థారణ అవ్వడంతో అంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు.

కోట వురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన ఓ యువకుడు.. 20 రోజుల కిందట రంగారెడ్డి జిల్లా నుంచి ఇంటికొచ్చాడు. ఇతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈనెల 5న పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితం రాకముందే కుర్రాడు పెళ్లికి రెడీ అయిపోయాడు. 2 రోజుల కిందట అట్టహాసంగా పెళ్లి చేసుకున్నాడు.

చర్చిలో జరిగిన ఈ పెళ్లికి 90 మంది హాజరవ్వగా.. అదే రోజు మధ్యాహ్నం ఇంట్లో పెట్టిన భోజనాలకు 500 మంది వచ్చి తినివెళ్లారు. ఈ తతంగం మొత్తం ముగిసిన తర్వాత పెళ్లికొడుక్కి కరోనా అని తేలింది. దీంతో ఆ 590 మంది ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు.. పెళ్లికొడుకు, పెళ్లికూతురు కుటుంబాలపై కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. 

చంద్ర‌బాబు ఆట‌లో పావులు

దిల్ రాజు ముందు చూపు